ఆమెతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీశాడు
కర్ణాటకలో 28 ఏళ్ల వివాహితను ఓ వ్యక్తి తన భార్య ముందే అత్యాచారం చేశాడు. బాధిత మహిళకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను సంపాదించి ఆ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బ్లాక్‌మెయిల్ చేస్తూ ఇస్లాం మతంలోకి మారమని బలవంతం చేశారనే ఆరోపణలతో ఒక జంట సహా ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి తన భార్య ఎదుటే తనపై అత్యాచారం చేశాడని, బుర్ఖా ధరించమని బలవంతం చేశారని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
నిందితుడు రఫీక్, అతని భార్య.. మహిళకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. ఆ తర్వాత ఆమెతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీశాడు. హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి మారాలని డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేశారు. రఫిక్, అతని భార్య 2023లో ఆ మహిళను బెలగావిలోని ఇంటికి మార్చారు. మేము చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలని ఆమెను డిమాండ్ చేశారని పోలీసులు తెలిపారు. గత ఏడాది ముగ్గురూ సహజీవనం చేస్తున్న సమయంలో భార్య ఎదుటే రఫీక్ తనపై అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించింది. భర్తకు విడాకులు ఇవ్వాలని రఫిక్ కోరాడని, తన డిమాండ్లకు అంగీకరించకపోతే తన సన్నిహిత ఫోటోలను బయటపెడతానని బెదిరించాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. తనను మతం మార్చుకోకుంటే చంపేస్తామని ఆ జంట బెదిరించారని తెలిపింది. మహిళ ఫిర్యాదుల ఆధారంగా ఏడుగురిపై సౌందట్టిలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.