అనుమానం ఓ మనిషిని కిరాతకుడిని చేసింది. ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది. 11 రోజుల పాపను అనాథను చేసింది. పెళ్లైన నాటి నుంచే భార్యపై అనుమానం పెట్టుకున్న ఓ భర్త 11 రోజుల బాలింతను అమానుషంగా చంపాడు. వివాహమైన రోజు నుంచే భార్య ఫోన్లు తనిఖీలు చేయడం, భార్యకు వచ్చిన మెస్సేజ్‌లపై నిఘా పెట్టాడు. భార్య ఎవరితో మాట్లాడినా ఆరా తీసేవాడు.
అనుమానం ఓ మనిషిని కిరాతకుడిని చేసింది. ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది. 11 రోజుల పాపను అనాథను చేసింది. పెళ్లైన నాటి నుంచే భార్యపై అనుమానం పెట్టుకున్న ఓ భర్త 11 రోజుల బాలింతను అమానుషంగా చంపాడు. వివాహమైన రోజు నుంచే భార్య ఫోన్లు తనిఖీలు చేయడం, భార్యకు వచ్చిన మెస్సేజ్‌లపై నిఘా పెట్టాడు. భార్య ఎవరితో మాట్లాడినా ఆరా తీసేవాడు. చివరికి బిడ్డకు జన్మనిచ్చిన 11 రోజులకే భార్యను హతమార్చాడు ఈ కిరాతకుడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఈ దారుణానికి ఒడిగాట్టాడు. భార్య తన తల్లి ఇంట్లో ఉన్నా ఆ ఇంటికి వెళ్లి మరీ హత్య చేశాడు. తర్వాత తానూ పురుగుల మందు తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కర్నాటకలోని హోస్కోట్‌లో ఈ ఘటన జరిగింది.
కిషోర్(32) పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 24 ఏళ్ల ప్రతిభతో గత ఏడాది నవంబర్ 13న పెళ్లి జరిగింది. 11 రోజుల క్రితమే పండంటి బిడ్డ పుట్టింది. ప్రతిభ హోస్కోట్ సమీపంలోని ఆమె తల్లి ఇంటి వద్ద ఉంది. ప్రతిభకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని కిశోర్ ప్రతి రోజూ అనుమానపు చూపులు చూసేవాడు. భార్యకు వచ్చే మెసేజ్‌లు, కాల్స్‌ను తరచుగా పరిశీలించేవాడు. భార్య మాట్లాడే వ్యక్తుల గురించి వివరాలు అడిగి తెలుసుకునే వాడు. కాలేజ్‌లో ఉన్నప్పుడు పరిచయం ఉన్న అబ్బాయిలతో ప్రతిభకు సంబంధాలు ఉన్నాయని తోటి పోలీసులు సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని ఆరోపణలు చేసేవాడని పోలీసులు తెలిపారు.
అయితే ఈనెల 5, ఆదివారం సాయంత్రం కిషోర్ ప్రతిభకు ఫోన్ చేసి అరిచాడు. ప్రతిభ ఫోన్‌లో ఏడవడంతో కిషోర్ అత్త ఫోన్ తీసుకొని కాల్ కట్ చేసింది. పసికందు ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, కిషోర్ కాల్స్‌ను ఎత్తాల్సిన అవసరం లేదని ప్రతిభకు తల్లి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
సోమవారం ఉదయం కిషోర్ 150 సార్లు ఫోన్ చేసినట్లు తన తల్లిదండ్రులకు ప్రతిభ చెప్పింది. భార్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కిషోర్‌కు కోపం కట్టలు తెంచుకుంది. ముందే అనుమానంతో ఉన్న కిషోర్ చామరాజనగర్ నుంచి దాదాపు 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన కిషోర్.. ఆదే రోజు ఉదయం 11:30 గంటల సమయంలో ప్రతిభ ఉంటున్న ఇంటికి చేరుకున్నాడు.
భార్య ప్రతిభ ఉన్న గదిలోకి వెళ్లి తలుపు వేసి దుపట్టాతో గొంతునులిమి ప్రతిభను హత్య చేశాడు. కొద్ది సేపటి తర్వాత ప్రతిభ తల్లికి అనుమానం వచ్చి తలుపు తీయడానికి ప్రయత్నించినా స్పందన లేదు. తలుపును ఎన్నిసార్లు తట్టినా తీయలేదు. 15 నిమిషాల తర్వాత గది బయటకు వచ్చి కిషోర్ పారిపోయాడని పోలీసులు తెలిపారు. తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కిషోర్ కోలుకున్న తర్వాత అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. కిషోర్ అనుమానం పెనుభూతమై నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కేవలం 11 రోజుల చిన్నారి అనాథగా మారింది