కర్నాటకలోని మాండ్యాలో స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి ఓ పాఠశాల విద్యార్థిని
కర్నాటకలోని మాండ్యాలో స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి ఓ పాఠశాల విద్యార్థిని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఆ అమ్మాయి అతడి దారికి తన సైకిల్ తో రావడమే ఆమె చేసిన తప్పు. తన సైకిల్‌తో దారికి అడ్డంగా ఉందనే ఆరోపణతో ఆ పాఠశాల విద్యార్థినిని చితకబాదారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 50 ఏళ్లు పైబడిన వ్యక్తి, బాలికను బహిరంగంగా కొట్టడం చూడొచ్చు.. ఆ అమ్మాయి విడిచిపెట్టమని ఆ వీడియోలో కోరుతూ వచ్చింది.
నిందితుడిని రమేష్‌గా గుర్తించి అరెస్టు చేశారు. విద్యార్థిని పరీక్షల నిమిత్తం పాఠశాలకు వెళుతుండగా రమేష్ స్కూటర్‌కు ఎదురుగా వచ్చింది. బాలిక పదేపదే వేడుకున్నా, క్షమాపణలు చెప్పినా రమేష్ స్కూటర్ దిగి ఆమెను కొట్టాడు. తనకు పరీక్షలు ఉన్నాయని బాలిక చెప్పినా రమేష్ ఆమె పట్ల కనికరం చూపలేదు.రమేష్‌పై పలు ఐపీసీ సెక్షన్స్ కింద, అలాగే బాలల రక్షణ చట్టం కింద అభియోగాలు మోపారు. బాలిక తండ్రి నుండి పోలీసులకు ఫిర్యాదు అందింది.