ఉత్తరప్రదేశ్‌(up)లోని కాన్పూర్‌(Kanpur)లో తన భార్యతో పడుకున్న సమయంలో ఇంటికి వచ్చిన భర్త.. అది చూసి ఆగ్రహానికి లోనయ్యాడు. భార్యను బెల్ట్‌తో చితకబాదాడు.

ఉత్తరప్రదేశ్‌(up)లోని కాన్పూర్‌(Kanpur)లో తన భార్యతో పడుకున్న సమయంలో ఇంటికి వచ్చిన భర్త.. అది చూసి ఆగ్రహానికి లోనయ్యాడు. భార్యను బెల్ట్‌తో చితకబాదాడు. ఆ తర్వాత ఆమె ప్రియుడు పారిపోయేందుకు ప్రయత్నించగా.. అతనిపై కూడా దాడి చేశాడు. అంతే కాదు ఏకంగా అతని అంగాన్ని కొరికి గాయపర్చాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని బాబూపూర్వ ప్రాంతంలో చోటుచేసుకుంది. భర్త, తన భార్యతో కలిసి ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అతడు లారీడ్రైవర్‌గా పనిచేస్తాడు. పని కోసం పక్క ఊరు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి బయటకు వెళ్లాడు. అయితే, అనుకోకుండా అదే రోజు రాత్రి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి చేరుకున్న అతడు, తన భార్యను పొరుగున ఉండే ప్రియుడితో అభ్యంతరకర స్థితిలో చూశాడు.

ఈ దృశ్యం చూసిన భర్తకు కోపం వచ్చింది. ఆవేశంతో పారిపోతున్న ప్రియుడిపై దాడి చేశాడు. ఈ క్రమంలో అతడి ప్రైవేట్ భాగాలను పట్టుకుని, దంతాలతో కొరికేందుకు ప్రయత్నించాడు. ఈ దాడిలో ప్రియుడు తీవ్రంగా గాయపడ్డాడు, రక్తస్రావం కావడంతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తాడు. అక్కడి నుంచి అతడిని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అతడి పరిస్థితి స్థిరంగా ఉందని, కానీ గాయాలు తీవ్రమైనవని తెలిపారు.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో, భార్య, ఆమె ప్రియుడు గత కొంతకాలంగా సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

ehatv

ehatv

Next Story