ఏలూరు జిల్లా కైకలూరులో అక్ర‌మ మ‌ద్యం స్మ‌గ్లింగ్ రాకెట్ గుట్టుర‌ట్ట‌య్యింది. రైలులో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం తరలిస్తున్న ముఠాను పోలీసులు ప‌ట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. వివ‌రాళ్లోకెళితే.. బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ముంబై నుంచి విశాఖపట్నం వెళ్లే ఎల్‌టీటీ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలను కైకలూరు పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఏలూరు(Eluru) జిల్లా కైకలూరు(Kaikaluru)లో అక్ర‌మ మ‌ద్యం(Illegal Liquor) స్మ‌గ్లింగ్ రాకెట్(Smuggling Rocket) గుట్టుర‌ట్ట‌య్యింది. రైలులో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం తరలిస్తున్న ముఠాను పోలీసులు(Police) ప‌ట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. వివ‌రాళ్లోకెళితే.. బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ముంబై(Mumbai) నుంచి విశాఖపట్నం(Vishakapatnam) వెళ్లే ఎల్‌టీటీ ట్రైన్‌(LTT Train)లో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలను కైకలూరు పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలను చీరాల(Chirala) వైఎస్ఆర్ కాలనీ(YSR Colony) వాడరేవు(Vadarevu)కు చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. 35 నుంచి 45 సంవత్సరాల వ‌య‌సు కలిగిన ముగ్గురు మహిళలు.. 24 బ్యాగుల్లో మద్యం తరలిస్తున్నారు. వీరు కొన్ని రోజులు క్రితం గోవా(Goa) వెళ్లి 1,35,600 విలువైన మద్యం కొనుగోలు చేశారు. అక్కడ నుంచి తిరిగి ముంబై చేరుకున్నారు. ముంబై నుంచి ఎల్‌టీటీ ట్రైన్‌లో ఆ మద్యాన్ని తరలిస్తున్నారు. వీరు ముంబై నుండి రాజమండ్రి(Rajahmundry) టికెట్ తీసుకున్నారు. అయితే.. ప్లాన్ ప్ర‌కారం వీరు రద్దీగా ఉండే పెద్ద స్టేషన్‌ల‌లో కాకుండా చిన్న చిన్న స్టేషన్‌ల‌లో దిగి గ్రామానికి చేరుకుంటారు. ఈ క్ర‌మంలోనే వీరు కైకలూరు పోలీసుల‌కు చిక్కారు. వీరి వద్దనుండి చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 2,949 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వీటి విలువ సుమారురూ. 4,54,400 రూపాయల వరకు ఉంటుంద‌ని అంచనా. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Updated On 28 Jun 2023 9:44 PM GMT
Yagnik

Yagnik

Next Story