మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించామని, అత్యాచారం జరిగినట్లు నిర్ధారించామని

జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో స్పానిష్ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో అరెస్టయిన ముగ్గురిని ఆదివారం కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. స్పెయిన్‌కు చెందిన మహిళ రాష్ట్ర రాజధాని రాంచీకి 300 కిలోమీటర్ల దూరంలోని హన్స్‌దిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుమహత్‌లో శుక్రవారం సామూహిక అత్యాచారానికి గురైంది. అక్కడ ఆమె తన భర్తతో కలిసి డేరాలో రాత్రి సమయంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సిఆర్‌పిసి సెక్షన్ 164 కింద ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసు సూపరింటెండెంట్ పితాంబర్ సింగ్ ఖేర్వార్ మాట్లాడుతూ, మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించామని, అత్యాచారం జరిగినట్లు నిర్ధారించామని చెప్పారు. ఈ నేరానికి పాల్పడిన ఏడుగురిలో ముగ్గురిని జైలుకు పంపామని, మిగతా నలుగురిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. న్యూఢిల్లీలోని స్పెయిన్ రాయబార కార్యాలయంతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారని ఖేర్వార్ తెలిపారు. 28 ఏళ్ల మహిళ, ఆమె 64 ఏళ్ల భర్త రెండు మోటార్‌సైకిళ్లపై బంగ్లాదేశ్‌ నుంచి దుమ్కాకు చేరుకుని బీహార్ మీదుగా నేపాల్‌కు వెళ్తున్నారు.. ఇంతలో ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు మమతా కుమారి బాధితురాలితో మాట్లాడింది. ఈ ఘటన దురదృష్టకరమని, జార్ఖండ్‌లో శాంతిభద్రతలని బయటపెట్టిందని ఆమె అన్నారు. నిందితులందరినీ వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని.. కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిందితులను ఎన్ కౌంటర్ చేసి చంపేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Updated On 4 March 2024 12:04 AM GMT
Yagnik

Yagnik

Next Story