ఉమేష్‌పాల్ హత్య కేసులో నిందితులైన మాఫియా డాన్ అతిక్ అహ్మద్(Gangster Atiq Ahmed), అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్(Ashraf Ahmed) లను ప్రయాగ్‌రాజ్(Prayagraj) మెడికల్ కాలేజీ సమీపంలో కాల్చి చంపారు. ఇద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళుతుండగా ముగ్గురు గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

Jailed gangster Atiq and his brother shot dead on way to check-up in Prayagraj
ఉమేష్‌పాల్ హత్య కేసులో నిందితులైన మాఫియా డాన్ అతిక్ అహ్మద్(Gangster Atiq Ahmed), అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్(Ashraf Ahmed) లను ప్రయాగ్‌రాజ్(Prayagraj) మెడికల్ కాలేజీ సమీపంలో కాల్చి చంపారు. ఇద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళుతుండగా ముగ్గురు గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇద్దరినీ దుండగులు అతి సమీపం నుంచి కాల్చిచంపారు. కాల్పులు జరిపిన ముగ్గురు దుండగులను పోలీసులు(Police) అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెరపైకి వచ్చింది. అతిక్, అష్రఫ్‌లను పోలీసులు వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకువచ్చారు అదే సమయంలో అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు అతిక్, అతని సోదరుడిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో అతిక్, అష్రఫ్ ఇద్దరూ చనిపోయారు. దాదాపు పది రౌండ్ల కాల్పులు జరిగాయి. కాల్పల్లో ఒక పోలీసు కూడా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్యకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో కలకలం రేగింది. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.
అంతకుముందు గురువారం అతిక్ కుమారుడు, ఉమేష్ పాల్(Umeshpaul) హత్య కేసులో నిందితుడైన అసద్ అహ్మద్(Asad Anmed) పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో అసద్‌తో పాటు అతిక్ షూటర్ గులాం మహ్మద్(Gulam Mahmad) కూడా చనిపోయాడు. అతిక్ అహ్మద్ మరణంతో 4 దశాబ్దాల క్రితం ప్రయాగ్‌రాజ్‌లో పునాది పడ్డ ఉగ్రవాద సామ్రాజ్యం అంతం కాబోతోందని చర్చ జరుగుతోంది.
