అంతర్జాతీయ సమాజం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇజ్రాయెల్‌(Israel) మాత్రం కాల్పుల విరమణను పట్టించుకోవడం లేదు. అదే మొండివైఖరితో వెళుతోంది. గాజాపై(Gaza) వైమానిక దాడులను(Airstrikes) ఉధృతం చేస్తున్నదే తప్ప ఆపడం లేదు.

అంతర్జాతీయ సమాజం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇజ్రాయెల్‌(Israel) మాత్రం కాల్పుల విరమణను పట్టించుకోవడం లేదు. అదే మొండివైఖరితో వెళుతోంది. గాజాపై(Gaza) వైమానిక దాడులను(Airstrikes) ఉధృతం చేస్తున్నదే తప్ప ఆపడం లేదు.

అమాయక పాలస్తీన(Palestine) ప్రజలను పొట్టనపెట్టుకుంటోంది. వారికి నిలువ నీడ లేకుండా ఇళ్లను ధ్వంసం చేస్తున్నది. కుటుంబాలకు కుటుంబలే శిథిలాల కింద సజీవ సమాధి అవుతున్నాయి. క్షతగాత్రులకు చికిత్స అందించడానికి ఆసుపత్రులే లేకుండా పోతున్నాయి.

ఆసుపత్రులపై కూడా ఇజ్రాయెల్ బాంబుదాడులు చేస్తున్నది. మంగళవారం రాత్రంతా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తూనే ఉంది. తాము హమాస్‌(Hamas) కమాండర్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. మధ్య, దక్షిణ గాజాలనే ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తున్నది. అక్కడ పాలస్తీనీయులు షెల్టర్‌ తీసుకుని ఉంటున్నారు. దాడుల్లో ధ్వంసమైన ఇళ్ల నుంచి మృతదేహాలను, గాయపడిన వారిని సహాయక బృందాలు తరలిస్తూనే ఉన్నాయి. అల్‌-అఖ్సా ఆసుపత్రి సమీపంలో ఒక్కచోటే 24 మృతదేహాలను ఖననం చేశారు. మృతులలో ఎక్కువ మంది పిల్లలే ఉండటం విషాదం.

రఫాలోని(Rapha) ఒక భవనంలోనే విధ్వంసం జరిగి రెండు కుటుంబాలకు చెందిన 47 మంది చనిపోయారు. ఖాన్‌యూనిస్‌లో ఒకే కుటుంబానికి చెందిన 32 మంది, గాజా సిటీలో 19 మంది మరణించారు. ఇప్పటి వరకు 5,791 మంది పాలస్తీనీయులు మరణించారు. 16,297 మంది గాయపడ్డారు. కరెంటు, ఇంధనం లేకపోవడంతో వైద్య కేంద్రాలు పూర్తిగా పని చేయడం లేదు. గాయాలతో వచ్చిన వారికి చికిత్సను అందించలేకపోతున్నాయి.

ఈజిప్టు నుంచి వచ్చే సాయం ఏ మూలకూ సరిపోవడం లేదు. మృతదేహాల ఖననానికి శ్మశానాల్లో చోటు లేకపోవడంతో పాత వాటిని తవ్వి వినియోగించాల్సి వస్తోంది. రోజూ వందల కొద్ది మృత దేహాలు శ్మశానాలకు వస్తున్నాయి. మరోవైపు సిరియా దక్షిణ ప్రాంతంలోని సైనిక స్థావరాలపై బుధవారం ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది.

ఈ దాడుల్లో ఎనిమిది మంది సిరియా(Siriya) సైనికులు చనిపోయారు. ఏడుగురు గాయపడ్డారు. ఇదిలా ఉంటే, పాలస్తీనాకు మద్దతుగా ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఆ సంస్థ ప్రతినిధులకు వీసాల జారీని నిలిపేస్తున్నామని ఐక్య రాజ్య సమితిలోని ఇజ్రాయల్‌ రాయబారి గిలద్‌ ఎర్డన్‌ తెలిపారు.

Updated On 26 Oct 2023 1:55 AM GMT
Ehatv

Ehatv

Next Story