మహిళా ఐఏఎస్‌ అధికారిణిపై వేధింపులకు పాల్పడిన ఐఆర్‌ఎస్‌ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్‌లు 354D, 354, 506 కింద కేసు నమోదు చేశారు. 2020లో కోవిడ్-19 సపోర్ట్ గ్రూప్‌లో పనిచేస్తున్నప్పుడు ఐఆర్‌ఎస్ అధికారిని కలిశానని బాధితురాలు ఆరోపించింది.

మహిళా ఐఏఎస్‌(IAS) అధికారిణిపై వేధింపులకు పాల్పడిన ఐఆర్‌ఎస్‌(IRS) అధికారిని పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌(Parliament Street PS)లో ఐపీసీ సెక్షన్‌(IPC Sections)లు 354D, 354, 506 కింద కేసు నమోదు చేశారు. 2020లో కోవిడ్-19 సపోర్ట్ గ్రూప్‌లో పనిచేస్తున్నప్పుడు ఐఆర్‌ఎస్ అధికారిని కలిశానని బాధితురాలు ఆరోపించింది. ఐఆర్‌ఎస్‌ అధికారి త‌న‌కు దగ్గరవ్వడానికి చాలాసార్లు ప్రయత్నించాడని.. కానీ ఆయ‌న‌ను తిరస్కరించిన‌ట్లు బాధితురాలు పేర్కొంది. తన భర్తకు కూడా తెలియడంతో ఆయ‌న‌తో మాట్లాడి దూరంగా ఉండాల్సిందిగా కోరినట్లు బాధితురాలు తెలిపింది. అయినా.. తనను కలవాలంటూ మెసేజ్‌(Messages)లు పంపుతూ వేధిస్తున్నారని బాధితురాలు తెలిపింది. పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

Updated On 19 May 2023 9:41 PM GMT
Yagnik

Yagnik

Next Story