Iran Missile Attack : కుర్దిస్తాన్ ప్రాంతంపై ఇరాన్ క్షిపణుల దాడులు
ప్రపంచంలో ఏ మూల చూసినా ఏదో ఒక ఉద్రికత్త. ఏదో ఒక సంఘర్షణ. ఏదో ఒక యుద్ధం. లేటెస్ట్‌గా ఇరాక్‌లోని(Iraq) కుర్దిస్తాన్(Kurdistan) ప్రాంతంపై ఇరాన్(Iran) దాడులు చేఇంది. ఎర్బిల్(Erbil) పట్టణంలోని గూఢాచార స్థావరాలు, ఇరాన్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలను(Terrorist organizations) లక్ష్యంగా చేసుకుని క్షిపణలు ప్రయోగించింది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్.
ప్రపంచంలో ఏ మూల చూసినా ఏదో ఒక ఉద్రికత్త. ఏదో ఒక సంఘర్షణ. ఏదో ఒక యుద్ధం. లేటెస్ట్‌గా ఇరాక్‌లోని(Iraq) కుర్దిస్తాన్(Kurdistan) ప్రాంతంపై ఇరాన్(Iran) దాడులు చేఇంది. ఎర్బిల్(Erbil) పట్టణంలోని గూఢాచార స్థావరాలు, ఇరాన్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలను(Terrorist organizations) లక్ష్యంగా చేసుకుని క్షిపణలు ప్రయోగించింది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్. సిరియాలోని(Syria) ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(Islamic state) శిబిరాలను కూడా ధ్వంసం చేసింది. కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి దగ్గరలోనే దాడులు జరిగాయి. ఇరాక్‌లో కుర్దిస్తాన్ ప్రాంతంలోని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్ఈ మొస్సాద్ ప్రధాన కార్యాలయంపైనా దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడిలో నలుగురు పౌరులు చనిపోయారు. ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. చనిపోయినవారిలో పెష్రా దిజాయి అనే స్థానిక వ్యాపారవేత్త, ఆయన కుటుంబసభ్యులు ఉన్నారు.