పురుషాంగం యోనిలోకి వెళ్తేనే లైంగిక దాడి జరిగినట్లు కాదు..!

పోక్సో చట్టం కింద లైంగికంగా దాడి జరిగిందని చెప్పడానికి పురుషాంగం యోనిలోకి ప్రవేశించడం తప్పనిసరికాదని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. బాలిక యోనిలోకి వెళ్తేనే లైంగికదాడి జరిగినట్లు కాదని ఆమె జననేంద్రియాలకు తాకినా, లేదా యోనిలోకి కొంచెమైనా ప్రవేశించినా పోక్సో చట్టం వర్తిస్తుందని న్యాయమూర్తులు పీబీ సురేష్‌కుమార్, జోబిన్ సెబాస్టియన్‌ల ధర్మాసనం వెల్లడించింది. 4 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని విచారిస్తున్న సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు నిందితుడు కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు. బాధితురాలి జననేంద్రియ వ్యవస్థలో భాగమైన యోని లోపలి భాగము చెక్కుచెదరకుండా ఉందంటూ వైద్య నివేదికలను కూడా జతపర్చారు. పురుషాంగం యోనిలోకి వెళ్లిందని నిర్ధారించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని వాదించారు. అయితే హైకోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. నిందితుడు నాలుగేళ్ల బాలికపై పదేపదే అత్యాచారం చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడని నిరూపణ అయింది. బాలిక తన జననేంద్రియాల నొప్పిని తల్లికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చగా నిందితుడిని దోషిగా నిర్ధారించి జీవితఖైదు విధించింది కేరళ హైకోర్టు. రూ.25 వేల జరిమానా కూడా విధించింది.
