ప్రాథమిక విచారణ అనంతరం జూబ్లీహిల్స్‌లోని గజ్జల వివేకానంద్‌ నివాసానికి పోలీసు బృందం వెళ్లింది

హైదరాబాద్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో సోమవారం సైబరాబాద్, గచ్చిబౌలి పోలీసులు సోదాలు చేయగా డ్రగ్స్‌ దొరికాయి. దీంతో హోటల్‌లో డ్రగ్స్‌తో పార్టీలు చేసుకుంటున్న రాజకీయ, వ్యాపార, సినీ పరిశ్రమతో సంబంధమున్న ముఠాను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బీజేపీ నాయకుడి కుమారుడు సహా 10 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అరెస్టయిన వారిలో మంజీరా గ్రూప్‌ కంపెనీ డైరెక్టర్‌, బీజేపీ నేత గజ్జల యోగానంద్‌ కుమారుడు గజ్జల వివేకానంద్‌ కూడా ఉన్నారు. సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీ, నిర్భయ్, కేధార్, మరో ఆరుగురు వ్యక్తులు ఈ కొనసాగుతున్న కేసులో నిందితులుగా గుర్తించారు.

ప్రాథమిక విచారణ అనంతరం జూబ్లీహిల్స్‌లోని గజ్జల వివేకానంద్‌ నివాసానికి పోలీసు బృందం వెళ్లింది. అతన్ని విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ సమయంలో అతను రాడిసన్ బ్లూలోని తన హోటల్ గదిలో కొకైన్ సేవించినట్లు ఒక పార్టీని నిర్వహించినట్లు అంగీకరించాడు. వైద్య పరీక్షల్లో వివేకానంద్ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ర్యాడిసన్‌ బ్లూ హోటల్‌లో జరిగిన డ్రగ్‌ పార్టీలో సినీ నటి లిషిగణేశ్‌ కూడా పాల్గొన్నట్టు నిర్ధారించిన పోలీసులు ఆమె పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్టు తెలిసింది. పార్టీలో మొత్తం 10 మంది పాల్గొనగా ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న వారిలో మరో వ్యక్తిని గుర్తించారు.

Updated On 27 Feb 2024 12:07 AM GMT
Yagnik

Yagnik

Next Story