ఒక కుటుంబం తమ లగేజీలో ఉన్న సుమారు 350 గ్రాముల బంగారు ఆభరణాలను పోగొట్టుకోవడంతో రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు పోలీసులు దొంగతనం కేసు నమోదు చేశారు

ఒక కుటుంబం తమ లగేజీలో ఉన్న సుమారు 350 గ్రాముల బంగారు ఆభరణాలను పోగొట్టుకోవడంతో రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు పోలీసులు దొంగతనం కేసు నమోదు చేశారు. ఖాజాగూడకు చెందిన మంచి కుట్ల హరి సాగర్ (43) అనే వ్యాపారి తన కోడలు రజిని సామల, తల్లి శకుంతల లగేజీలో బంగారు, వజ్రాభరణాలు సహా విలువైన వస్తువులు మాయమైనట్లు ఫిర్యాదు చేశారు. సాగర్ కుటుంబం మే 3న ముంబైకి విమానంలో వెళ్లడానికి ఖాజాగూడలోని వారి నివాసం నుండి ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. మరుసటి రోజు న్యూయార్క్ వెళ్లారు.

న్యూయార్క్‌కు చేరుకోగానే బంగారం, వెండి వస్తువులు ఉన్న బ్యాగులో న‌గ‌లు మాయ‌మై.. అందులో మూడు పెట్టెలు ఖాళీగా కనిపించాయని గుర్తించారు. ఎయిర్‌పోర్ట్‌లోనే మిస్ అయ్యాయ‌ని అనుమానిస్తూ సాగర్.. ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. త‌మ న‌గ‌లు వెతికిపెట్టండని పోలీసులను ఫిర్యాదు ద్వారా అభ్యర్థించాడు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 18 May 2024 10:32 PM GMT
Yagnik

Yagnik

Next Story