బట్టతల అంటూ భార్య హేళన చేయడంతో అవమానాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

బట్టతల అంటూ భార్య హేళన చేయడంతో అవమానాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కర్ణాటకలో చామరాజనగర తాలూకాలోని ఉడిగాలలో చోటుచేసుకుంది. పరమశివమూర్తి (32) అనే వ్యక్తికి మమతతో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. లారీ డ్రైవర్‌ అయిన పరమశివమూర్తికి పెళ్లినాటికే కొంత బట్టతల ఉంది. పెళ్లి తరువాత ఇది మరింత తీవ్రమైంది. భార్య మమత ‘నీకు జట్టు లేదు, నీతో బయటకి రావాలంటే సిగ్గుగా ఉంది’ ఇలాంటి మాటలంటూ అవహేళన చేయడంతో దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో భర్తపై గృహహింస, కట్నం వేధింపుల కేసు కూడా పెట్టడంతో కొన్ని రోజులు జైలులో ఉండి ఈ మధ్యనే పరమశివమూర్తి విడుదలయ్యాడు. జైలు నుంచి బయటికి వచ్చిన పరమ శివమూర్తి.. భార్య సోషల్‌ మీడియాలోని ‘సింగిల్‌’ స్టేటస్‌ చూసి మరింత ఆవేదన చెందాడు. తీవ్ర మనస్తాపనకు గురైన నేపథ్యంలో సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై చామరాజనగర గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ehatv

ehatv

Next Story