ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత ఇన్‌స్టాగ్రామ్‌కు బానిస కావడంతో
యూపీలోని నోయిడాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత ఇన్‌స్టాగ్రామ్‌కు బానిస కావడంతో ఆమె భర్త ఆమెను వారించడం ప్రారంభించాడు. అయితే తనను ఇలా వారిస్తావా అని తీవ్ర మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకుంది. సెక్టార్-39 ప్రాంతంలోని సదర్‌పూర్ ప్రాంతానికి సంబంధించినది ఈ ఘటన. భార్య ఎక్కువగా Instagram ఉపయోగిస్తోందని భర్త మందలించగా.. భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతదేహాన్ని చూసిన భర్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఆత్మహత్యకు గల ఇతర కారణాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
సెక్టార్-45 సదర్‌పూర్ కాలనీలోని వీధి నంబర్-10కి చెందిన ఓంవీర్‌కు తొమ్మిదేళ్ల క్రితం విశాఖతో వివాహమైందని పోలీసులు తెలిపారు. వృత్తిరీత్యా ఓలా బైక్ రైడర్ అయిన ఓంవీర్ అద్దెకు ఇల్లు తీసుకున్నాడు. ఓంవీర్‌కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున విశాఖ తన ఇంట్లోని గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫోరెన్సిక్ బృందం ఆధ్వర్యంలో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.