బీహార్‌లోని అర్వాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి 139 జాతీయ రహదారిపై టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్‌పూర్ కుటి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
బీహార్(Bihar)లోని అర్వాల్(Arwal)లో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. శుక్రవారం రాత్రి 139 జాతీయ రహదారి(National Highway)పై టెంపో(Tempo)ను లారీ(Lorry) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. సదర్ పోలీస్ స్టేషన్(Sadar Police Station) పరిధిలోని హసన్‌పూర్(Hasanpur) కుటి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు(Police) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రక్కు ఢీకొనడంతో టెంపోలో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. మృతదేహాలను గుర్తించేందుకు సమీపంలోని పోలీస్ స్టేషన్ల సహాయం తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం, మృతదేహాలను సదర్ ఆసుపత్రి(Sadar Hospital)లో ఉంచారు. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. లారీ డ్రైవర్ కోసం వెతుకుతున్నామని.. ప్రజలను ఒప్పించి శాంతింపజేసినట్లు తెలిపారు.
టెంపోలో ఐదుగురు ప్రయాణికులు భోజ్‌పూర్(Bojpur) నుంచి అర్వాల్ వైపు వెళ్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. టెంపోను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్(Lorry Driver) పరారయ్యాడని(Escape) ప్రజలు చెబుతున్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. వెనుక నుంచి లారీ టెంపోపైకి దూసుకెళ్లింది. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం అందజేస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది. పోలీసులు లారీని సీజ్ చేశారు.