ఉత్తరప్రదేశ్‌లోని దౌకీ ప్రాంతంలో గురువారం ఉదయం పెను ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు కోసం రోడ్డు పక్కన నిలబడి ఉన్న పిల్లలపై నుంచి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు చనిపోయారు. ఇద్దరు గాయపడటంతో ఆస్పత్రిలో చేరారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్(Utter Pradesh)లోని దౌకీ ప్రాంతంలో గురువారం ఉదయం పెను ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు(School Bus) కోసం రోడ్డు పక్కన నిలబడి ఉన్న పిల్లలపై నుంచి కారు(Car) దూసుకెళ్లింది. ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు చనిపోయారు. ఇద్దరు గాయపడటంతో ఆస్పత్రిలో చేరారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆగ్రహించిన గ్రామస్తులు ఫతేహాబాద్(Fatehabad)-ఆగ్రా(Agra) రహదారిని దిగ్బంధించారు. గురువారం ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
దౌకి గ్రామంలో పిల్లలు పాఠశాల బస్సు కోసం రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. ఫతేబాద్ రోడ్డు నుంచి వేగంగా వస్తున్న కారు ఐదుగురు చిన్నారులపై నుంచి దూసుకెళ్లింది. కొందరు చిన్నారులు రోడ్డుపక్కకు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడ్డ పిల్లలు గ్రామానికి వెళ్లి పెద్దలకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డును దిగ్బంధించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందినట్లు ఏసీపీ ఫతేహాబాద్ సౌరభ్ సింగ్(Saurab Singh) తెలిపారు. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పోలీసులు గ్రామస్తులను ఒప్పించి ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.