హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ కళాశాల విద్యార్థినిని ఓ యువకుడు తన ప్రవేట్ వీడియోను ఇంటర్నెట్ లో అప్‌లోడ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)కు చెందిన ఓ కళాశాల విద్యార్థినిని ఓ యువకుడు తన ప్రవేట్ వీడియోను ఇంటర్నెట్(Internet) లో అప్‌లోడ్ చేసి బ్లాక్ మెయిల్(Blackmail) చేస్తున్నాడని ఆరోపించింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గత ఏడాది కాలేజీ సాంస్కృతిక కార్యక్రమం(Cultural Programme)లో పాల్గొనేందుకు మండి వెళ్లానని, అక్కడ చంబా జిల్లాకు చెందిన అబ్బాయితో స్నేహం ఏర్పడిందని కాలేజీ విద్యార్థిని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు(Complaint)లో పేర్కొంది. ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఒకరోజు ఆ అబ్బాయి ఆమెకు వీడియో కాల్(Video Call) చేసి, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆమెను బట్టలు కూడా విప్పమని కోరాడు. అతని కోరిక మేరకు ఆమె తన బట్టలు విప్పింది. అతడు వీడియోను రికార్డ్(Video Record) చేశాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించడం మొదలుపెట్టి, ఆ వీడియోను సోషల్ మీడియా(Social Media)లో అప్‌లోడ్ చేసి వైరల్ చేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ బాధిత విద్యార్థిని పోలీసుల(Police)ను ఆశ్రయించింది. బాధిత విద్యార్థిని వాంగ్మూలం ఆధారంగా యువకుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అర్జిత్ సేన్ ఠాకూర్(Arjit Sen Thakur) తెలిపారు.