లెబనాన్‌లో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా సభ్యుల పేజర్లలో వరుస పేలుళ్ల కారణంగా తొమ్మిది మంది మరణించారు.

లెబనాన్‌లో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా సభ్యుల పేజర్లలో వరుస పేలుళ్ల కారణంగా తొమ్మిది మంది మరణించారు. ఈ పేలుడు వేల మంది హిజ్బుల్లా సభ్యుల పేజర్లలో జరిగింది, ఇందులో 3,000 మందికి పైగా గాయపడ్డారు. హిజ్బుల్లా సభ్యులు ఈ పేజర్ల ద్వారా సంభాషించుకునేవారు. అయితే.. ఈ పేలుడు వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.

లెబనాన్‌లో మంగళవారం నాటి పేలుళ్లకు నెలరోజుల ముందు లెబనీస్ టెర్రర్ గ్రూప్ హిజ్బుల్లా ఆదేశించిన 5,000 తైవాన్-నిర్మిత పేజర్లలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కొద్దిపాటి పేలుడు పదార్థాలను అమర్చింది. దీని వెనుక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సంబంధించి మొసాద్ హస్తం ఉందని లెబనీస్ సీనియర్ భద్రతా వర్గాలు వార్తా సంస్థ రాయిటర్స్‌తో అన్నారు.

మొస్సాద్ ఆపరేషన్‌ను.. హిజ్బుల్లా భద్రతా లోపంగా కూడా చెబుతున్నారు. లెబనాన్ అంతటా వేలాది పేజర్లలో పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో తొమ్మిది మంది మరణించారు. దాదాపు 3,000 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో హిజ్బుల్లా యోధులు.. బీరూట్‌లోని ఇరాన్ రాయబారి ఉన్నారు. ఇరాన్ మద్దతుతో హిజ్బుల్లా.. ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. అయితే పేలుళ్లపై వ్యాఖ్యానించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story