అన్న కూతురిని ప్రేమించాడని..!

అన్న కూతురును ప్రేమించాడని ఆ యువతి చిన్నాన్నా.. యువకుడి ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పటించిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్‌ (Alwal Police Station) పరిధిలో జరిగింది. మాచ బొల్లారం గోపాల్‌నగర్‌ ఎరుకుల బస్తీలో ప్రకాష్‌-హేమలత దంపతులు తమ కూమారుడు ప్రదీప్‌తో కలిసి ఉంటున్నారు. ఇదే ప్రాంతంలో వివేకానంద్‌ బైక్‌ షోరూం నిర్వహిస్తున్నాడు. ప్రదీప్‌ వివేకానంద బైక్ షోరూంలో పనిచేస్తుండగా వివేకానంద అన్న కూతురుతో ప్రదీప్‌కు పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారింది. ఈ విషయం వివేకానందకు తెలియడంతో పలు మార్లు ప్రదీప్‌ను హెచ్చరించాడు. ప్రదీప్‌ వైఖరి నచ్చకపోవడంతో ఆ కుటుంబాన్నే అంతమొందించాలనుకున్నాడు. ఆగ్రహంతో ఇంటి తలుపులపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఆ సమయంలో ప్రదీప్‌ ఇంట్లో లేడు, అతని తండ్రి ప్రకాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఉంటున్న దిలీప్ కూతురు చాందిని (4) కాళ్లకు మంటలు అంటుకుని గాయాలయ్యాయి. చిన్నారి చాందినిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, ప్రకాష్‌ గాంధీ (Gandhi Hospital) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు వివేకానంద పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 16 Jan 2025 7:02 AM GMT
ehatv

ehatv

Next Story