ప్రియురాలి శీలాన్ని 20 లక్షలకు వెలకట్టిన నీచుడు..!

ఓ దుర్మార్గుడు ఓ యువతి వెంటపడ్డాడు. ప్రేమించానని నమ్మించాడు.. యువతితో చనువుగా మెలిగాడు.. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అన్నీ అయిపోయాక పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి మర్చిపో అంటూ తేలికగా చెప్పేశాడు. తాను మోసపోయానని అనుకొని మోసగాడిపై జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10లోని గాయత్రీ హిల్స్‌లో ఉంటున్న సాయి ప్రణీత్‌ సాఫ్టవేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. బెంగళూరులో పనిచేస్తున్న సమయంలో 2023లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకే హాస్టల్‌లో ఉండేవారు. ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ప్రణీత్‌కు యువతి దగ్గరైంది. అక్కడి నుంచి గాయత్రీహిల్స్‌కు మకాం మార్చిన సాయి ప్రణీత్‌ యువతితో కలిసి సహజీవనం కూడా చేశాడు. తన చెల్లి పెళ్లి తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పి నవంబర్‌లో ఆమెను వదిలేసి వెళ్లాడు. చెల్లి ఫొటోలు పంపించాలని కోరగా కొన్ని పంపించడంతో యువతికి అనుమానం వచ్చి పెళ్లి కోసం మరింత ఒత్తిడి చేయడంతో నేరుగా ఆమె ఉంటున్న గదికి వెళ్లి చితకబాది.. ఇంటి నుంచి వెళ్లిపోవాలని గెంటివేశాడు. నాతో తిరిగినందుకు రూ.20 లక్షలు ఇస్తాను వదిలేసి వెళ్లిపో అని బెదిరించాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

ehatv

ehatv

Next Story