హర్యానాలోని పంచకులలో ఓ వ్యక్తి తన భార్యను బేస్ బాల్ బ్యాట్‌తో

హర్యానాలోని పంచకులలో ఓ వ్యక్తి తన భార్యను బేస్ బాల్ బ్యాట్‌తో బహిరంగంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కారులో ఉన్న వ్యక్తితో తన భార్య సన్నిహితంగా ఉందని గమనించడంతో అతడు ఈ పనికి పాలడ్డాడు. తన భార్య మరో వ్యక్తితో కలిసి వాహనంలో కూర్చున్నట్లు గుర్తించిన వ్యక్తి కారు అద్దాన్ని పగులగొట్టాడు. ఆ తర్వాత ఆ మహిళ అడ్డుకుంటున్నా కూడా అతను బేస్ బాల్ బ్యాట్‌తో ఆమెను కొట్టాడు.

వీడియోలో ఆ వ్యక్తి తన భార్య మోసం చేసిందని ఆరోపించాడు. కారులోపల మహిళతో పాటు ఉన్న వ్యక్తి రక్షించేందుకు రాకపోవడమే కాకుండా.. ఈ తతంగం చూస్తూనే ఉన్నాడు. అయితే, మహిళ కేకలు వేయడంతో అక్కడి వ్యక్తులు సంఘటనా స్థలానికి చేరుకుని దాడి చేయకుండా అడ్డుకున్నారు.మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలో నిందితుడిని అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఓ పోలీసు అధికారి ఇండియా టుడే టీవీకి తెలిపారు.

Updated On 18 April 2024 12:49 AM GMT
Yagnik

Yagnik

Next Story