Hamas Attack On Music Festival : మ్యూజిక్ ఫెస్టివల్‌లో హామస్ ఉగ్రవాదుల ఘాతుకం
ఇజ్రాయెల్(Israel) పై హమాస్(Hamas) పగపట్టింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు(Terrosist) జరిపిన దాడులలో ఏడు వందలకుపైగా ఇజ్రాయెలీలు మరణించారు. ఇందులో మ్యూజిక్ ఫెస్టివల్(Music Festival) ప్రాంగణంలోనే 260 మృతదేహాలను గుర్తించారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇజ్రాయెల్(Israel) పై హమాస్(Hamas) పగపట్టింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు(Terrosist) జరిపిన దాడులలో ఏడు వందలకుపైగా ఇజ్రాయెలీలు మరణించారు. ఇందులో మ్యూజిక్ ఫెస్టివల్(Music Festival) ప్రాంగణంలోనే 260 మృతదేహాలను గుర్తించారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్‌లో వ్యవసాయపండుగ, యూదులు ఈజిప్ట్ నుంచి వలస వచ్చిన రోజులను స్మరించుకునే సందర్భం కలిసి రావడంతో వరుస సెలవులు వచ్చాయి.
వారం రోజుల పాటు సంబరాల్లో మునిగిపోతారు ఇజ్రాయెలీలు. ఇజ్రాయెల్-గాజా సరిహద్దు సమీపంలో నెగెవ్ ఎడారి ఉంది. అందులో కిబ్బర్జ్ రీమ్ సమీపంలోని ఓ విశాల ప్రాంగణంలో ట్రైబ్ ఆఫ్ నోవా కంపెనీ ది సూపర్ నోవా పేరిట మ్యూజిక్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసింది. పండుగ రోజులలో ఈ సంగీత మహోత్సవానికి సుమారు మూడు వేల మంది హాజరయ్యారు. శనివారం ఉదయం మ్యూజిక్ ఫెస్టివల్ పార్టీ జోరుగా సాగుతోంది. అదే సమయంలో రాకెట్లు ఒకదాని వెనుక ఒకటి విరుకుచుపడసాగాయి.
సంగీతపు హోరులో ఆ శబ్దాలు చాలా మందికి వినిపించలేదు. అంతలోనే ఒక్కసారిగా ఎయిర్ డిఫెన్స్ సైరన్లు మోగాయి. తర్వాత కరెంట్ నిలిచిపోయింది. ఇది జరిగిన కొన్ని నిమిషాల్లోనే వ్యాన్లలో 50 మంది హమాస్ ఉగ్రవాదులు అక్కడికి వచ్చారు. ప్రేక్షకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ప్రజలు పారిపోవడానికి కూడా వీలులేకుండా పోయింది. ఎగ్జిట్ ద్వారం చిన్నగా ఉండటంతో పారిపోవడానికి కుదరలేదు.
కాల్పులు మొదలు కాగానే పారిపోవడానికి ప్రయత్నించానని, తన వెహికల్ మరో వెహికిల్‌ను ఢీకొనడంతో ఆగిపోయిందని ఏస్తర్ బ్రోచోవ్ అనే మహిళ చెప్పింది. దగ్గరలో కారు నడుపుతున్న ఓ యువకుడు తనను రక్షించేందుకు తన వాహనంలో ఎక్కించుకున్నాడని, కొద్దిసేపటికే ఆ యువకుడిని పాయింట్ బ్లాంక్ రేంజిలో హమాస్(Hamas) ఉగ్రవాదులు కాల్చిచంపారని బ్రోచోవ్ తెలిపింది.
తాను కూడా ఔచనిపోయినట్లు నటిస్తూ.. ఏమాత్రం కదలకుండా అక్కడే పడిపోయానని, ఉగ్రవాదులు అక్కడి నుంచి వెళ్లిపోయాక.. ఇజ్రాయెల్(Israel) సైనికులు వచ్చి తనను రక్షించారని బ్రోచోవ్ వివరించింది. మరి కొందరు పార్టీ సందర్శకులు చెట్లు, పొదల చాటున దాక్కొని ప్రాణాలు కాపాడుకొన్నారు. అయినా ఉగ్రవాదులు ప్రతి చెట్టు వద్దకు వెళ్లి తనిఖీలు చేశారు. కనిపించిన వారిని కాల్చిచంపారు.
ఆ తర్వాత మూడు గంటలకు ఇజ్రాయెల్(Israel) సైనికులు అక్కడికి వచ్చి పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తన జీవితంలో ఇలాంటి నరమేధం చూడలేదని యనీవ్ అనే ఎమర్జెన్సీ మెడికో చెప్పాడు. ఇది ముందుగానే ప్రణాళికతో చేసిన దాడి అని అన్నాడు. మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఉన్న విదేశీయులను హమాస్ ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న జర్మనీకి చెందిన యువతి జాడ కనిపించడం లేదు. బ్రిటన్‌కు చెందిన జాక్ మార్లోవ్ ఈ పార్టీలో గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు అతడు కూడా కనిపించడం లేదు.