హైదరాబాద్‌లో తుపాకీ మిస్ ఫైర్ విషాదం నింపింది. పాతబస్తీ హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో తుపాకీ మిస్ ఫైరింగ్ కార‌ణంగా హెడ్ కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ మృతి చెందాడు.

హైదరాబాద్‌(Hyderabad)లో తుపాకీ మిస్ ఫైర్(Gun Misfire) విషాదం నింపింది. పాతబస్తీ హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్(Old City Hussaini Alam Police Station) పరిధిలో తుపాకీ మిస్ ఫైరింగ్ కార‌ణంగా హెడ్ కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్(Bhupathi Srikanth) మృతి చెందాడు. చేతిలోని తుపాకీ మిస్ ఫైర్ అవ‌డంతో శ్రీకాంత్ తీవ్ర‌ గాయాల‌పాల‌య్యాడు. నిన్న రాత్రి పోలీస్ పికెట్ లో విధులు ముగించుకుని నిద్రిస్తున్న క్రమంలో గన్ మిస్ ఫైర్ అయి బుల్లెట్ చెవిలోకి దిగింది. దీంతో తీవ్ర ర‌క్త స్రావం అయ్యింది. గాయ‌ల‌పాలైన భూపతి శ్రీకాంత్ ను ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి స‌మాచారం తెలియాల్సివుంది.

Updated On 22 Aug 2023 9:54 PM GMT
Yagnik

Yagnik

Next Story