క్షుద్రపూజల మూఢనమ్మకంతో నరబలికి పాల్పడ్డారు ఒక దంపతులు . గుజరాత్‌లోని(Gujarat) రాజ్‌కోట్ (Rajkot)జిల్లాలో ఒక జంట తమ తలలను బలి ఇచ్చేందుకు తమ తలలుని వారే నరుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లోనే తయారు చేసిన గిలెటిన్ లాంటి పరికరాన్ని(guillotine-like device,) ఉపయోగించి వారు ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది . చనిపోయిన మృతులను హేముభాయ్ మక్వానా(Hemubhai Makwana) (38), అతని భార్య హన్సాబెన్Hansaben (35)దంపతులుగా గుర్తించారు.ఘటనా స్థలం నుంచి పోలీసులకు సూసైడ్ నోట్ కూడా లభించింది.
క్షుద్రపూజల మూఢనమ్మకంతో నరబలికి పాల్పడ్డారు ఒక దంపతులు . గుజరాత్‌లోని(Gujarat) రాజ్‌కోట్ (Rajkot)జిల్లాలో ఒక జంట తమ తలలను బలి ఇచ్చేందుకు తమ తలలుని వారే నరుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లోనే తయారు చేసిన గిలెటిన్ లాంటి పరికరాన్ని(guillotine-like device,) ఉపయోగించి వారు ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది . చనిపోయిన మృతులను హేముభాయ్ మక్వానా(Hemubhai Makwana) (38), అతని భార్య హన్సాబెన్Hansaben (35)దంపతులుగా గుర్తించారు.ఘటనా స్థలం దగ్గర పోలీసులకు సూసైడ్ నోట్ కూడా లభించింది.
గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో "వించియా గ్రామంలోని( Vinchhiya village)తమ సొంత పొలంలో ఉన్న గుడిసెలో ఉన్న గిలెటిన్ లాంటి పరికరం తో బ్లేడ్‌తో జంట తలలు తెగిపడేలా ఒక తాడుని అమర్చారు. "దంపతులు మొదట తమ తలలను తాడుతో పట్టుకున్న గిలెటిన్ లాంటి పరికరం అమర్చుకున్నాక వాటిపై తలను ఉంచడానికి ముందు అగ్ని గుండాన్ని సిద్ధం చేసుకున్నారు . వారు తాడును లాగిన వెంటనే, ఒక ఇనుప బ్లేడ్ వారిపై పడింది, వారి తలలు తెగిపోయాయి, తలలు నేరుగా మంటల్లోకి పడ్డాయి ," శిరచ్చేదనం తర్వాత శరీరాలతో అగ్నిగుండంలో పడిచనిపోయారు అని పోలీసులు నిర్దారించారు .
ఈ దారుణమైన ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది . శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది .అలాగే , సంఘటనా స్థలం లో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత ఏడాది కాలంగా వీరిద్దరూ ప్రతిరోజూ గుడిసెలో ఈ క్షుద్రపూజల్ని చేస్తున్నారని దంపతుల కుటుంబ సభ్యులు తెలిపారు.
దంపతులకు ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు , ఇతర బంధువులతో కలిపి అదేగ్రామంలో నివసిస్తున్నారు, ఆదివారం ఉదయం సంఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు . దంపతుల వద్ద లభించిన సూసైడ్ నోట్ కూడా లభించిందని, అందులో తమ తల్లిదండ్రులు, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని బంధువులను కోరినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలుస్తుంది .