అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఆలమూరు మండలం మడికి నాలుగు లైన్ల జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున టాటా ఏసీ వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతిచెందారు.

Four killed in road accident in Ambedkar Konaseema district
అంబేద్కర్ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema District)లో ఘోరప్రమాదం(Road Accident) జరిగింది. జిల్లా కేంద్రంలోని ఆలమూరు మండలం(Alamur) మడికి నాలుగు లైన్ల జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున టాటా ఏసీ(TATA ACE) వాహనాన్ని కారు(CAR) ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతిచెందారు. ప్రమాదంలో గాయపడిన మరో తొమ్మిది మందిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న రావులపాలెం(Ravulapalem) సీఐ రజనీ కుమార్(Rajanikumar), ఎస్ఐ శివప్రసాద్(Shiva Prasad) లు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
