వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

Four killed in a road accident in Warangal district
వరంగల్ జిల్లా(Warangal District)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఆటో(Auto)ను లారీ(Lorry) ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వర్ధన్నపేట(Varddannapet) మండలం ఇల్లంద(Illanda)లో ఈ ప్రమాద(Accident) ఘటన చోటుచేసుకుంది. వరంగల్ నుంచి ఆటో తొర్రూరు(Thorroor) వైపు వెళ్తుండగా.. లారీ ఢీకొని ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మృతులు తేనె విక్రయించుకునే కూలీలుగా సమాచారం. మద్యం మత్తులో లారీ నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
