నేపాల్(Nepal)లోని బాగ్మతి ప్రావిన్స్‌లోని మారుమూల ప్రాంతంలో మంగళవారం కారు లోయలో పడటంతో నలుగురు భారతీయులు(Indians) మరణించారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బీహార్(Bihar) రిజిస్ట్రేషన్‌తో ఐదుగురు భారతీయ పౌరులతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బాగ్మతి ప్రావిన్స్‌లోని సింధులి జిల్లాలో రోడ్డు పైనుండి 500 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. మృతి చెందిన నలుగురూ పురుషులే. ముగ్గురు అక్కడికక్కడే మరణించారని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ సిల్వాల్(Rajkumar Silwal) తెలిపినట్లు ఖాట్మండుకు చెందిన వార్తాపత్రికలు పేర్కొన్నాయి. […]
నేపాల్(Nepal)లోని బాగ్మతి ప్రావిన్స్‌లోని మారుమూల ప్రాంతంలో మంగళవారం కారు లోయలో పడటంతో నలుగురు భారతీయులు(Indians) మరణించారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బీహార్(Bihar) రిజిస్ట్రేషన్‌తో ఐదుగురు భారతీయ పౌరులతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బాగ్మతి ప్రావిన్స్‌లోని సింధులి జిల్లాలో రోడ్డు పైనుండి 500 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. మృతి చెందిన నలుగురూ పురుషులే. ముగ్గురు అక్కడికక్కడే మరణించారని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ సిల్వాల్(Rajkumar Silwal) తెలిపినట్లు ఖాట్మండుకు చెందిన వార్తాపత్రికలు పేర్కొన్నాయి. గాయపడిన ఓ ప్రయాణికుడిని సింధూలి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని కూడా తదుపరి చికిత్స కోసం ధులిఖేల్ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ప్రమాద స్థలం నుండి మృతదేహాలను వెలికితీయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించారని వెల్లడించారు.
సమస్తిపూర్(Samastipur) జిల్లా కళ్యాణ్‌పూర్(Kalyanpur) పోలీస్ స్టేషన్‌కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) గౌతమ్ కుమార్(Gautham Kumar) పిటిఐతో మాట్లాడుతూ.. “మృతుల్లో ఒకరు మృత్యుంజయ్ కుమార్ సింగ్(Mrityunjay Kumar Singh).. కళ్యాణ్‌పూర్ పీఎస్ పరిధిలోకి వచ్చే ఫుల్హరా గ్రామానికి చెందినవాడు. మరిన్ని వివరాల కోసం మేము అతని కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నించామన్నారు. సమస్తిపూర్, పాట్నాలోని పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ.. మరణించిన, గాయపడిన ఇతర భారతీయుల గుర్తింపును నిర్ధారించలేకపోయారు. అయితే.. నేపాల్ నుండి వచ్చిన నివేదికలు మాత్రం వారు కూడా సమస్తిపూర్ నివాసితులే అని సూచిస్తున్నాయి.