కజకస్తాన్‌కు(Kazakhstan) చెందిన ఓ మాజీ మంత్రి(Minister) తన భార్యను అతి కిరాతకంగా కొట్టి చంపాడు. భార్యను చంపుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో(social meida) వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన కజకస్తాన్‌ ప్రజలు రోడ్డెక్కారు. నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఆ మంత్రి కోర్టు విచారణ ఎదుర్కొంటున్నాడు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు ప్రజలు.

కజకస్తాన్‌కు(Kazakhstan) చెందిన ఓ మాజీ మంత్రి(Minister) తన భార్యను అతి కిరాతకంగా కొట్టి చంపాడు. భార్యను చంపుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో(social meida) వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన కజకస్తాన్‌ ప్రజలు రోడ్డెక్కారు. నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఆ మంత్రి కోర్టు విచారణ ఎదుర్కొంటున్నాడు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు ప్రజలు. ఆ మాజీ ఆర్ధికమంత్రి పేరు కువాన్‌దిక్‌ బిషింబయెవ్‌. 44 ఏళ్ల వయసున్న ఇతడు తన బంధువు పేరిట ఉన్న ఓ రెస్టారెంట్‌లో లాస్టియర్‌ నవంబర్‌లో ఈ ఘాతుకానికి తలపడ్డాడు. 31 ఏళ్ల వయసున్న తన భార్య సల్తానత్‌ సుకెనోవాను దారుణంగా హింసించి చంపేశాడు. అప్పుడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులకు అతడిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు విచారణ జరుపుతున్నది. ఈ శ్యాలు భయాన్ని కలిగిస్తున్నాయి. తన భార్యను జట్టుపట్టి ఈడ్చి కొట్టి, ఇష్టానుసారం తన్ని.. ఇలా దాదాపు ఎనిమిది గంటల పాటు దారుణంగా హింసించాడు. రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టుడుతూ స్పృహ కోల్పోయి ఉన్నప్పటికీ తన భార్య బాగానే ఉందంటూ హోటల్‌ సిబ్బందితో కువాన్‌దిక్‌ బిషింబయెవ్‌ చెప్పడం కూడా వీడియోలో రికార్డయ్యింది. 12 గంటల తర్వాత కానీ అంబులెన్స్‌ అక్కడికి చేరుకోలేదు. ఈలోగా ఆమె చనిపోయింది. పోస్టుమార్టమ్‌లో తలకు, ముక్కుకు బలమైన గాయాలయ్యాయని, ఒంటిపై పలు చోట్ల గాయాలున్నాయని తేలింది. ఈ కేసు దర్యాప్తులో.. సీసీ టీవీ ఫుటేజీ తో పాటుగా సాక్ష్యాలన్నింటిని బిషింబయెవ్‌ తుచిడిపెట్టే ప్రయత్నం చేశాడని పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. తన భార్య మానసిక స్థితి బాగోలేదని, ఈ క్రమంలోనే తనకు తాను గాయాలు చేసుకుని ఆమె చనిపోయిందని న్యాయస్థానాల్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ ఎనిమిది గంటలపాటు సాగిన అకృత్యానికి సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు రావడంతో ఆ భర్త చేసిన దారుణం బయటకు వచ్చింది. భార్యను అలా ఎందుకు చంపాల్సి వచ్చిందన్నది మాత్రం అతడు చెప్పడం లేదు. ఈ కేసు విచారణలో ఆ దేశపు సుప్రీం కోర్టులో జరుగుతోంది. కజకస్తాన్‌ చరిత్రలోనే తొలిసారి ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది ఆ దేశ అత్యున్నన్యాయస్థానం. బిషింబయెవ్‌ నేరం గనుక రుజువు అయితే అక్కడి చట్టాల ప్రకారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షపడుతుంది.

Updated On 4 May 2024 1:33 AM GMT
Ehatv

Ehatv

Next Story