చిత్తూరు జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని వడమాల పేట వద్ద టెంపోను లారీ ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. తిరుపతి- చెన్నై ప్రధాన రహదారిలోని వడపమాల పేట మండలం, అంజారమ్మ కనం వద్ద ఘటన చోటుచేసుకుంది.
చిత్తూరు(Chittoor) జిల్లాలో ఘోరప్రమాదం(Accident) జరిగింది. జిల్లా కేంద్రంలోని వడమాల పేట(Vadamalapeta) వద్ద టెంపో(Tempo)ను లారీ(Lorry) ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. తిరుపతి- చెన్నై(Tirupati-Chennai Way) ప్రధాన రహదారిలోని వడపమాల పేట మండలం, అంజారమ్మ కనం వద్ద ఘటన చోటుచేసుకుంది. మృతులు పాకాల మండలం శ్రీరామపురం కు చెందిన డి. రేఖ (24), తిరుపతి నగరంలోని గోపాల్ రాజు కాలనీకి చెందిన పి. గిరిజమ్మ (48), కుప్పం మండలం కనుగొంది గ్రామానికి చెందిన పి .సి. అజయ్ కుమార్ (25), ఐరాల మండలం కలికిరి వారి పల్లికి చెందిన పి. రేవంత్ కుమార్ (26), చంద్రగిరి మండలం కాశి పెంట్లకు చెందిన లారీ డ్రైవర్ కె.శివకుమార్( 63) గా గుర్తించారు. ప్రమాదంలో గాయాల పాలైన క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. టెంపో డ్రైవర్ ఆనంద్(Anandh) నిర్లక్ష్య కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు(Police) వెల్లడించారు. జాతీయ రహదారిలో వ్యతిరేక దిశ రావడంతో ప్రమాదం జరిగినట్టు పేర్కొన్నారు. పుత్తూరు రూరల్ సీఐ సురేష్ కుమార్(Putturu Rural CI Suresh Kumar) ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.