ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పోలీస్ స్టేషన్ సహపౌ ప్రాంతంలో గత రాత్రి ట్రాక్టర్ ట్రాలీ, డంపర్ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో పది మందికి పైగా గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లోని హత్రాస్(Hathras)లో ఘోర ప్రమాదం(Accident) జరిగింది. పోలీస్ స్టేషన్ సహపౌ(Sahapau) ప్రాంతంలో గత రాత్రి ట్రాక్టర్ ట్రాలీ(Tractor Trolly), డంపర్ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో పది మందికి పైగా గాయపడ్డారు. సదాబాద్-జలేసర్(Sadabad-Jalesar) రహదారిలోని సహపావు ప్రాంతంలోని నల్గా బ్రాహ్మణ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. సుమారు పది మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆగ్రా, అలీఘర్ ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా(Serious Condition) ఉంది.
ఎటా జిల్లాలోని సక్రౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గధియా మౌజ్‌పూర్(Gadhia Maujpur) గ్రామం నుండి శుక్రవారం రాత్రి భక్తులతో నిండిన ట్రాక్టర్-ట్రాలీ మధుర-బృందావన్‌కు వెళుతోంది. గ్రామస్తులతో పాటు ఆగ్రా(Agra), ఫిరోజాబాద్(Firozabad) ప్రాంతానికి చెందిన వారి బంధువులు కూడా ట్రాక్టర్-ట్రాలీలో ఉన్నారు.
జలేసర్-సదాబాద్ రహదారిలోని సహపావు ప్రాంతంలోని నాగ్లా బ్రాహ్మణ సమీపంలో సదాబాద్ నుండి వస్తున్న క్యాంటర్ డంపర్.. ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో క్యాంటర్ డ్రైవర్(Driver) వాహనంతో పాటు అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాద సమయంలో ట్రాక్టర్-ట్రాలీలో 25 మందికి పైగా ఉన్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కసారిగా కలకలం రేగింది. సహపావు, సదాబాద్ తదితర పోలీస్ స్టేషన్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామ ప్రజలు కూడా అక్కడికి భారీగా వచ్చారు. ట్రాక్టర్-ట్రాలీలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో.. క్షతగాత్రులను సిఓ, పోలీసు వాహనాల ద్వారా సిహెచ్‌సి సదాబాద్‌కు పంపించారు. కొంతమంది పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి అలీగఢ్, ఆగ్రాలకు రెఫర్ చేశారు.