ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో ఓ బాధాకరమైన ఘటన చోటుచేసుకుంది. రాంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుడిసె అగ్నికి ఆహుతైంది. మంటల్లో ఒక మహిళ, ఆమె ఐదుగురు పిల్లలు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Fire Broke Out In A Hut In Kushinagar Woman And Five Children Burnt Alive
ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లోని ఖుషీనగర్(Kushinagar)జిల్లాలో ఓ బాధాకరమైన ఘటన చోటుచేసుకుంది. రాంకోలా పోలీస్ స్టేషన్(Ramkola Police Station) పరిధిలో ఓ గుడిసె(Hut) అగ్నికి ఆహుతైంది. మంటల్లో ఒక మహిళ, ఆమె ఐదుగురు పిల్లలు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు(Poice) సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం(Postmortem) నిమిత్తం తరలించారు. సమాచారం ప్రకారం.. ఖుషినగర్‌లోని నగరపంచాయతీ రాంకోలాలోని ఉర్ధా గ్రామంలో బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ఒక గుడిసెలో మంటలు చెలరేగాయి. గుడిసెలో ఐదుగురు పిల్లలతో నిద్రిస్తున్న మహిళ సజీవ దహనమైంది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా మేజిస్ట్రేట్ రమేష్ రంజన్(Ramesh Ranjan), పోలీసు సూపరింటెండెంట్ ధవల్ జైస్వాల్(Dhawal Jaishwal), ఏఎస్పీ రితేష్ కుమార్ సింగ్(Ritesh Kumar Singh) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో సంగీత (38), ఆమె కుమారుడు అంకిత్ (10), కుమార్తెలు లక్ష్మి (9), రీటా (3), గీత (2), ఏడాది బాబు మరణించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాలన్నింటిని పోస్టుమార్టంకు తరలించారు. అర్థరాత్రి జరిగిన ఈ హృదయ విదారక ఘటనతో అక్కడి ప్రజలు హడలిపోయారు.
