సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర్ మండలం చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి.

Fire Accident in Sangareddy District
సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర్ మండలం చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులలో పరిశ్రమ డైరెక్టర్ రవి కూడా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంపై సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
