ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున లోనిలోని ఓ టెంట్ షాపులో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే దుకాణం పైనున్న ఇంటిపైకి మంటలు వ్యాపించాయి. ఇంట్లో ఉన్న కొందరు ఇంటిపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మరణించారు.
ఉత్తరప్రదేశ్(Utterpradesh)లోని ఘజియాబాద్(Ghaziabad)జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున లోనిలోని ఓ టెంట్ షాపు(Tent House)లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే దుకాణం పైనున్న ఇంటిపైకి మంటలు వ్యాపించాయి. ఇంట్లో ఉన్న కొందరు ఇంటిపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మరణించారు. సమాచారం ప్రకారం, లోనిస్ బార్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్‌బాగ్ సి బ్లాక్(Lalsingh C Block)లోని ఒక టెంట్ హౌస్‌లో మంటలు చెలరేగాయి. టెంట్ హౌస్(Tent House) పైన నిర్మించిన మూడంతస్తుల ఇంటికి కూడా మంటలు వ్యాపించాయి. మంటల కారణంగా ఇద్దరు మహిళలు మరణించారు. అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి 4 వాహనాల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. కుటుంబంలోని 9 మంది సభ్యులు పొరుగువారి డాబాపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
మంటలను ఆర్పే క్రమంలో అగ్నిమాపక శాఖ(Fire Department)లోని ఓ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే(Short Circuit) కారణమని చెబుతున్నారు. సమాచారం మేరకు లాల్ బాగ్ కాలనీలో సతీష్ పాల్(Satish Paul) కుటుంబంతో టెంట్ హౌస్ నడిపిస్తూ నివసిస్తున్నాడు. వారి మూడంతస్తుల ఇంటి క్రింద టెంట్ హౌస్ ఉంది. అందరూ పై అంతస్తులో ఉన్నారు. సోమవారం ఉదయం 5:15 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్నారు. ఒక్కసారిగా కింద దుకాణం నుంచి పొగలు రావడం మొదలైంది. చుట్టుపక్కల వారు కొందరిని రక్షించారు. ఈ సమయంలోనే మంటలు తీవ్ర రూపం దాల్చాయి. ఇంట్లో ఉన్న సతీష్ పాల్, కుసుమ్, తరుణ్, అమన్, సౌరభ్, విమల, దీపు, రూబీ, కాజల్‌లు ఇరుగుపొరుగు టెర్రస్‌లపైకి దూకారు. చుట్టుపక్కల వారు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో లక్షల విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. మంటలను ఆర్పిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది మమత (32), భరతో దేవి (74) మృతదేహాలను బయటకు తీశారు. మృతులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఏసీపీ రజనీష్‌కుమార్ ఉపాధ్యాయ్(Rajineesh Kumar Upadyay), సీఎఫ్‌వో రాహుల్ పాల్(Rahul Paul) సంఘటనా స్థలానికి చేరుకున్నారు.