ఈ ఘటన గురించి తెలియడంతో నిందితుడిని గ్రామ పంచాయతీకి పిలిపించారు.

మధురలో ఒక యువకుడు మైనర్ బాలికను బలవంతంగా ముద్దుపెట్టుకుని.. ఆమెను వేధించాడు. ఆ తర్వాత సంఘటన స్థలం నుండి పారిపోయాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తూ ఉంది. మీడియా నివేదికల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌కు చెందిన మైనర్ బాలిక పలు ప్రాంతాలను సందర్శించడానికి తన కుటుంబంతో కలిసి మధురకు వచ్చింది. బాలిక ఒక చేతిలో పసికందును పట్టుకుని వీధి గుండా వెళుతున్నట్లు.. ఓ యువకుడు ఆమె వద్దకు వచ్చి ఆమెను బలవంతంగా ముద్దుపెట్టుకుని పారిపోయాడు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన సీసీటీవీ వీడియోలో రికార్డయింది.

ఈ ఘటన గురించి తెలియడంతో నిందితుడిని గ్రామ పంచాయతీకి పిలిపించారు. పంచాయతీలో నిందితుడు పదే పదే చెప్పుతో 10 సార్లు కొట్టుకుని అధికారులకు క్షమాపణలు చెప్పాడు. సంఘటన జరిగిన వెంటనే అమ్మాయి, ఆమె కుటుంబం పశ్చిమ బెంగాల్‌కు తిరిగి వెళ్లిపోయారు. సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. తప్పు చేసిన యువకుడిని.. పోలీసు అధికారులు ఇంకా గుర్తించలేదు, ఈ విషయంలో ఇప్పటివరకు ఎటువంటి కేసు నమోదు చేయలేదు.

Updated On 13 April 2024 8:53 PM GMT
Yagnik

Yagnik

Next Story