మెదక్ జిల్లాలో ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది.
బెట్టింగ్.. ఎంతో మంది జీవితాలను సర్వ నాశనం చేసింది. ఎంతో మంది ఆ ఊబిలో ఇరుక్కుని బయటకు రాలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇంకొంత మందికి తల్లిదండ్రులు ఎంతో నచ్చజెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయినా కూడా కొంత మందిలో మార్పు రాదు. అలాంటి కొడుకుని.. కన్న తండ్రే కడతేర్చారు.
మెదక్ జిల్లాలో ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. చిన్న శoకరంపేట మండలంలోని బగిరాత్ పల్లిలో సత్యనారాయణ అనే వ్యక్తి తన భార్య, కొడుకు ముకేశ్ కుమార్(28) తో కలిసి నివాసం ఉంటున్నాడు. కొడుకు రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. ముఖేష్ కుమార్ గత కొన్ని నెలల నుండి బెట్టింగ్ కు బానిస అయ్యాడు. బెట్టింగ్‌కు అలవాటు పడిన ముఖేష్ కుమార్ రూ.2 కోట్లు రూపాయల వరకు పోగొట్టుకున్నాడు. అయినా కూడా ముకేశ్ ప్రవర్తనలో మార్పు రాలేదు. తండ్రి సత్యనారాయణ బెట్టింగ్‌లు మానుకోవాలని పలుమార్లు మందలించాడు. అయినా కూడా కొడుకు ముఖేష్ కుమార్ తండ్రి మాటలు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆగ్రహం చెందిన తండ్రి సత్యనారాయణ అర్ధరాత్రి సమయంలో ముఖేశ్ తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రస్థాయిలో చెలరేగింది. ముఖేశ్ మాట వినకపోవడంతో ఆగ్రహానికి లోనైన తండ్రి సత్యనారాయణ కొడుకుపై దాడి చేసి హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.