జోగులాంబ గద్వాల జిల్లా ఐజకు చెందిన భార్గవ్‌కు(Bhargav) 2019లో వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పెంట్లవెల్లికి చెందిన పల్లవితో(Pallavi) పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత సవంత్సరకాలం పాటు వీరి కాపురం సవ్యంగానే సాగింది. ఈ జంటకు కూతురు, కొడుకు ఉన్నారు. ఏడాది తర్వాత భార్గవ్ తన విశ్వరూపాన్నిప్రదర్శిడం మొదలు పెట్టాడు. భార్యపై అనుమానంతో భార్గవ్ వేధించసాగాడు. అనుమానంతో ఆమెను అవమానించేవాడు. ఇంట్లో నుంచి ఎక్కడికీ వెళ్లనిచ్చేవాడు కాదు..
జోగులాంబ గద్వాల జిల్లా ఐజకు చెందిన భార్గవ్‌కు(Bhargav) 2019లో వనపర్తి(Wanaparthi) జిల్లా వీపనగండ్ల(Veepanagandla) మండలం పెంట్లవెల్లికి చెందిన పల్లవితో(Pallavi) పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత సవంత్సరకాలం పాటు వీరి కాపురం సవ్యంగానే సాగింది. ఈ జంటకు కూతురు, కొడుకు ఉన్నారు. ఏడాది తర్వాత భార్గవ్ తన విశ్వరూపాన్నిప్రదర్శిడం మొదలు పెట్టాడు. భార్యపై అనుమానంతో భార్గవ్ వేధించసాగాడు. అనుమానంతో ఆమెను అవమానించేవాడు. ఇంట్లో నుంచి ఎక్కడికీ వెళ్లనిచ్చేవాడు కాదు.. బంధుమిత్రులతో ఫోన్ కూడా మాట్లాడకుండా పల్లవిపై ఆంక్షలు విధించాడు. రోజురోజుకు భార్గవ్‌కు అనుమానం పిచ్చి ఎక్కువైంది. ఈ క్రమంలో ఓ సారి పల్లవిని గొలుసులతో బంధించి చితకబాదాడు కూడా. దీంతో రెండు నెలల క్రితం ఇద్దరి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చెలరేగి పిల్లలను తీసుకొని పల్లవి పుట్టింటికి వెళ్లిపోయింది.
భార్యపై అనుమానం, కోపం పెంచుకున్న భార్గవ్ తనలోని రాక్షసత్వాన్నిబయటపెట్టాడు. కొడుకు నందకిషోర్‌కు(Nandakishore) డిసెంబర్ 29న నిద్రమాత్రలు(Sleeping Pills), ఎలుకల మందు(Poison) రెండూ కలిపి నీటిని బలవంతంగా నీటిని తాగించాడు. ఇది గమనించిన స్థానికులు చిన్నారిని ఆస్పత్రికి తరలించగా కోలుకున్నాడు. అయితే జనవరి 3న మరోసారి చిన్నారి నందకిషోర్‌కు నిద్రమాత్రలు, ఎలుకల మందు తాగించాడు. ఆ తర్వాత భార్గవ్ కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. తర్వాత రోజు అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి నందకిషోర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి చేసిన పనికి పాపం రెండేళ్ల పసికూన ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం భార్గవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్గవ్‌పై భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.