ఓ మహిళ దొంగలు తన మీద దాడి చేసి డబ్బులు కొట్టేశారని చెప్పింది

ఓ మహిళ దొంగలు తన మీద దాడి చేసి డబ్బులు కొట్టేశారని చెప్పింది. ఈ విషయమై పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. తీరా చివరికి ఆ మహిళ ఆన్ లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకుందని తేలింది. ఆన్‌లైన్ గేమ్‌లలో డబ్బు పోగొట్టుకున్న హైదరాబాద్ మహిళ తన ఇంట్లో దోపిడీ జరిగిందంటూ సీన్ క్రియేట్ చేసింది.

రాజేంద్రనగర్‌లోని తన ఇంట్లో ఇద్దరు వ్యక్తులు చొరబడి రూ. 25,000 లాక్కుని వెళ్ళడానికి ప్రయత్నించారని.. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తనను తోసివేసి అక్కడి నుంచి పారిపోయారని మహిళ పేర్కొంది. ఆమె వాంగ్మూలం మేరకు రాజేంద్రనగర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే చోరీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోలీసులు ఆ మహిళను ప్రశ్నించగా.. తాను దొంగతనం నాటకాన్ని ఆడినట్లు చెప్పింది. ఆన్‌లైన్ గేమ్‌లలో 25,000 రూపాయలు పోగొట్టుకోవడమే కాకుండా.. ఇంకొంచెం డబ్బు తన స్నేహితుల నుంచి అప్పుగా తీసుకున్నట్లు కూడా వెల్లడించింది. డబ్బు పోగొట్టుకున్న తర్వాత, దొంగతనం నాటకం ఆడింది. అది నిజం అని నిరూపించేందుకు తన గదిని కూడా అస్తవ్యస్తం చేసింది.

Updated On 12 April 2024 12:46 AM GMT
Yagnik

Yagnik

Next Story