ఓవర్‌టేక్ చేస్తున్న ఆటోను ముందు నుంచి వేగంగా వస్తున్న డంపర్ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.
మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఝాన్సీ-మీర్జాపూర్ హైవేపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓవర్‌టేక్ చేస్తున్న ఆటోను ముందు నుంచి వేగంగా వస్తున్న డంపర్ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మొత్తం ఐదుగురు చనిపోయారు. గాయపడిన మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. మృతులను ఇంకా గుర్తించలేదు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ డంపర్‌ను వదిలి పారిపోయాడు.
కార్వీ కొత్వాలి ప్రాంతంలోని అమన్‌పూర్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. చిత్రకూట్ ధామ్ కార్వీ రైల్వే స్టేషన్ నుంచి తొమ్మిది మంది ప్రయాణికులను ఎక్కించుకుని ఆటో రామ్‌ఘాట్‌కు వెళ్తుండగా అమన్‌పూర్‌కు రాగానే.. ఆటో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించడంతో.. ఎదురుగా భరత్‌కప్ నుంచి వస్తున్న డంపర్ ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ డంపర్‌ను వదిలి పారిపోయాడని కార్వీ కొత్వాలి ఇన్‌ఛార్జ్ ఎస్సై ఉపేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఐదుగురిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.