శంషాబాద్‌లో(Shamshabad) జరిగిన అప్సర(Apsara) హత్య నగరాన్ని కుదిపేసింది. ప్రియుడు సాయికృష్ణ(Sai Krishna) హత్య చేశాడని తెలిసి జనం విస్తుపోయారు. గుళ్లో పూజారిగా ఉంటున్న సాయికృష్ణ హత్య చేయడమేమిటని అనుకుంటున్నారు.
శంషాబాద్‌లో(Shamshabad) జరిగిన అప్సర(Apsara) హత్య నగరాన్ని కుదిపేసింది. ప్రియుడు సాయికృష్ణ(Sai Krishna) హత్య చేశాడని తెలిసి జనం విస్తుపోయారు. గుళ్లో పూజారిగా ఉంటున్న సాయికృష్ణ హత్య చేయడమేమిటని అనుకుంటున్నారు. నమ్మి తన వెంట వచ్చిన అప్సరను దారుణంగా చంపి, డెడ్‌బాడీని(Dead Body) మ్యాన్‌హోల్‌లో(Manhole) వేసి మట్టి కప్పాడు సాయికృష్ణ. తర్వాత తనే అప్సర తల్లితో కలిసి పోలీసులకు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చాడు. అయితే ఈ హత్య కేసులో మరి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికితే కేసులో ఉన్న అనుమానాలు నివృత్తి అవుతాయి.
1.అప్సర హత్యను సాయికృష్ణ ఒక్కడే చేశాడా? ఇంకెవరైనా సాయికృష్ణకు సాయం చేశారా? అప్సరను బెల్లం దంచె కర్రతో కొట్టి చంపితే కారులో రక్తం మరకలు ఉండాలిగా? వాటిని సాయికృష్ణ ఎప్పుడు తుడిపాడు?
2. కారులోనే అప్సర మృతదేహాన్ని పెట్టుకుని రాత్రంతా కారును ఇంటి ముందు పార్క్ చేశాడని పోలీసులు అంటున్నారు. ఎవరైనా పసిగడతారన్న భయం సాయికృష్ణకు కలగలేదా?
3.సాయికృష్ణ ఒక్కడే అప్సర మృతదేహాన్ని మ్యాన్‌హోల్ వరకు తీసుకొచ్చాడా? ఇది ఎలా సాధ్యం?
4.మ్యాన్‌హోల్‌లో సాయికృష్ణ శవాన్ని వేసి ఆపై మట్టి కూడా కప్పాడని చెబుతున్నారు. ఇంత చేస్తున్నప్పుడు అక్కడ జనం ఎవరూ లేరా? ఉంటే ఎందుకు పట్టించుకోలేదు?
5. సాయికృష్ణతో కలిసి కోయంబత్తూరుకు వెళుతున్నానని కూతురు చెబితే ఎందుకో ఏమిటో తెలుసుకోకుండా తల్లి ఎలా పంపించింది? మళ్లీ సాయికృష్ణ వచ్చి భద్రాచలం పంపించాను అంటే ఎలా నమ్మింది?
6. అప్సర కనబడకపోతే కాశీలో ఉన్న ఆమె తండ్రి ఎందుకు రాలేదు? కనీసం ఫోన్‌లోనైనా సమాచారం కనుక్కున్నారా?
7.అప్సర ఇంకెవరితోనో చనువుగా ఉండటం భరించలేక సాయికృష్ణ హత్య చేశాడని పోలీసులు అంటున్నారు..ఇదే నిజమైతే ఆ మరో వ్యక్తి ఎవరు?
8.అప్సరతో తన భర్తకు సంబంధం ఉందన్న విషయం సాయికృష్ణ భార్యకు తెలుసా? ఎప్పుడైనా చెప్పి చూశారా?
9.అప్సర సెల్‌ఫోన్‌ను పోలీసులు గుర్తించారా?