'ఢీ' షో డ్యాన్సర్ కావ్య కల్యాణి(24) ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లా పొన్నెకల్లులోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.

'ఢీ' షో డ్యాన్సర్ కావ్య కల్యాణి(24) ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లా పొన్నెకల్లులోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన చావుకు అభి కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. తనని పెళ్లి చేసుకొని తనతో కాపురం చేస్తూ ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నట్లు కావ్యకళ్యాణి సెల్ఫీ వీడియోలో వివరించింది. 'నా పేరు కావ్య. నేను చచ్చిపోబోతున్నాను. నా చావుకి కారణం అభి. ఐదు సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి, తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇప్పుడేమో మరో అమ్మాయిని తీసుకొచ్చి ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు. నన్ను వెళ్లిపొమ్మన్నాడు. ఇప్పుడు నేను ఉరేసుకుంటున్నాను. సారీ అమ్మ.. సారీ డాడీ' అంటూ యువతి సెల్ఫీ వీడియో ద్వారా తెలిపింది.

ehatv

ehatv

Next Story