డెహ్రాడూన్‌లో 12వ తరగతి విద్యార్థిని తన ప్రియుడితో కలిసి ట్యూషన్ టీచర్ ఇంట్లో చోరీకి పాల్పడింది. ఘటన అనంతరం వారిద్దరూ హరిద్వార్‌కు వెళ్లారు. రాత్రి బస చేసి మరుసటి రోజు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 26న చక్షా నగర్ నెహ్రూ కాలనీకి చెందిన దంతవైద్యుడు వీరేంద్ర కుమార్ తన కుటుంబంతో కలిసి ఏప్రిల్ 20న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు రూర్కీ వెళ్లారు.

Dehradun girl and lover steal cash and jewelry from tuition teacher house
డెహ్రాడూన్(Dehradun)లో 12వ తరగతి విద్యార్థిని తన ప్రియుడితో కలిసి ట్యూషన్ టీచర్(Tution Teacher ఇంట్లో చోరీకి పాల్పడింది. ఘటన అనంతరం వారిద్దరూ హరిద్వార్(Haridwar)కు వెళ్లారు. రాత్రి బస చేసి మరుసటి రోజు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 26న చక్షా నగర్ నెహ్రూ కాలనీ(Nehru Colony)కి చెందిన దంతవైద్యుడు వీరేంద్ర కుమార్(Veerendra Kumar) తన కుటుంబంతో కలిసి ఏప్రిల్ 20న వివాహ వేడుక(Wedding)కు హాజరయ్యేందుకు రూర్కీ వెళ్లారు. ఏప్రిల్ 26న తిరిగి వచ్చి చూసే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఓ గదిలో ఉంచిన అల్మారాలోని లక్షల విలువైన నగలు, సుమారు రూ.18 వేలు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై నెహ్రూకాలనీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్‌హెచ్‌ఓ లోకేంద్ర బహుగుణ(Lokendra Bahuguna) ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌ఐ యోగేష్ దత్(Yogesh Dutt).. ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీలను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో ఓ యువతి, ఓ యువకుడు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
విచారణ అనంతరం నిందితులు సోనియా(Soniya), ఆమె ప్రియుడు చక్షా నగర్ నెహ్రూ కాలనీకి చెందిన అమర్‌పాల్(Amar Pal)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి చోరీకి గురైన నగలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో.. తాను 12వ తరగతి విద్యార్థిని అని.. వీరేంద్ర కుమార్ భార్య వద్దకు ట్యూషన్ కోసం వెళ్లేదానినని సోనియా చెప్పింది. కొన్ని రోజుల క్రితం ట్యూషన్ టీచర్ రూర్కీ(Roorkee)లో తన రిలేషన్స్ పెళ్లికి హాజరయ్యేందుకు నాలుగైదు రోజులు వెళుతున్నానని చెప్పింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ ఉండరని నిందితురాలు సోనియాకు తెలిసి ప్రియుడితో కలిసి చోరీకి ప్లాన్ చేసింది. పథకం ప్రకారం.. ఏప్రిల్ 21వ తేదీ రాత్రి ఇద్దరూ కలిసి ఇంటి తాళాలు పగులగొట్టి అల్మీరాలో ఉంచిన నగలు, నగదును అపహరించారు.
నిందితులిద్దరూ చోరీ చేసిన సొత్తును సమీపంలోని మైదానంలో దాచి సరదాగా గడిపేందుకు హరిద్వార్ వెళ్లారు. ఇద్దరూ హరిద్వార్‌లోని ఒక హోటల్‌లో రాత్రి బస చేసి.. మరుసటి రోజు ఉదయం నిశ్శబ్దంగా తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. చోరీ చేసిన నగదులో రూ.10వేలు సోనియా తన బ్యాంకు ఖాతా(Bank Account)లో జమ చేసింది. ఏప్రిల్ 26న ఇద్దరూ నగలను విక్రయించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
