ఐపీఎల్ బెట్టింగ్‌లో పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో అప్పులు చేశాడు. అప్పుల వాళ్ళు తిరిగి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆ బాధ తట్టుకోలేక డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్న సతీష్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాయ్స్ హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఐపీఎల్ బెట్టింగ్(IPL Betting)లో పెద్ద ఎత్తున డబ్బులు(Money) పోగొట్టుకున్నాడు. దీంతో అప్పులు చేశాడు. అప్పుల వాళ్ళు తిరిగి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆ బాధ తట్టుకోలేక డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్న సతీష్(Satish) అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్(Chikkadapalli Police Station) పరిధిలోని ఓ బాయ్స్ హాస్టల్(Boys Hostel)లో ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ(Vijayawada)లోని లయోలా కాలేజీ(Layola College)లో సతీష్(21) డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సతీష్ నెల రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. అశోక్ నగర్(Ashok Nagar)లోని ఓ బాయ్స్ హాస్టల్ లో ఉంటున్నాడు.
గత ఐపీఎల్ లో పెద్ద ఎత్తున బెట్టింగ్(Betting)కు పాల్పడ్డాడు. నష్టాలను పుడ్చుకునేందుకు అప్పులు చేశాడు. సతీష్ చేసిన అప్పుల గురించి కుటుంబ సభ్యులకు తెలిసి కొంతవరకు తీర్చారు. అయినప్పటికీ సతీష్ అప్పులు తీరలేదు. ఈ క్రమంలో నెలరోజుల క్రితం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. గత నెల రోజుల నుంచి హాస్టల్‌లో అంటూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలోనే లోన్ యాప్ వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. ఒకవైపు అప్పుల బాధ, మరొకవైపు లోన్ యాప్(Loan APPs) వేధింపులు భరించలేక హాస్టల్ లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య(Suicide)కు పాల్పడ్డాడు. సమాచారం అందిన వెంటనే చిక్కడపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సతీష్ మరణించిన విషయమై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.