ఇన్సురెన్స్ డబ్బు కోసం సొంత చెల్లినే సోదరుడు హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

ఇన్సురెన్స్ డబ్బు కోసం సొంత చెల్లినే సోదరుడు హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కాటూరివారిపాలేనికి చెందిన సంధ్యకు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టలేదు. దీంతో సంధ్యను భర్త వదిలేశాడు. దీంతో ఆమె తన అన్న అశోక్ కుమార్ వద్ద నివాసం ఉంటోంది. రియల్ ఎస్టేట్‌లో నష్టపోయిన అశోక్ తన చెల్లెలిపై వేర్వేరు కంపెనీల్లో రూ.1.20 కోట్లకు ఇన్సురెన్స్ చేశాడు. తన లాస్‌ను పూడ్చుకునేందుకు చెల్లిని హత్యచేశాడు. ఇన్సురెన్స్ క్లెయిం చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నాడు. తీరా లోతుగా విచారణ జరగ్గా సోదరుడే హత్య చేశాడని తేలింది. ఈ ఘటన గతేడాది జరిగింది. పోలీసుల విచారణలో ఇప్పుడు బయటపడింది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story