ఉత్తరప్రదేశ్‌లోని సంబల్ జిల్లాలోని కేసర్‌పూర్ గ్రామంలో, ఓ మహిళకు పెళ్లయింది.

ఉత్తరప్రదేశ్‌లోని సంబల్ జిల్లాలోని కేసర్‌పూర్ గ్రామంలో, ఓ మహిళకు పెళ్లయింది. వివాహిత అయినప్పటికీ మరొక యువకుడితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నారు. వారిద్దరూ ఒక గదిలో సరదాగా గడుపుతుండగా సమీప బంధువుల కంటపడ్డారు. తర్వాత వారిద్దరినీ తాడుతో కట్టి, ఇనుప రాడ్‌తో కొట్టారు. ఊరి వీధిలో తాళ్లతో కట్టివేస్తారు, ఆ పురుషుడిని అతని భార్య కొడుతుంది, ఆ స్త్రీని ఆమె భర్త కొడతాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా, వివాహేతర సంబంధం పెట్టుకున్నా పోలీసులకు అప్పగించకుండా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని విచక్షణారహితంగా దాడి చేయడంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ వీడియో ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించడానికి పోలీసులు కృషి చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story