చక్కగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండకుండా పెళ్లిలో వధూవరులిద్దరూ విషం తాగారు. పెళ్లి కొడుకు చనిపోయాడు. పెళ్లికూతురి పరిస్థితేమో విషమంగా ఉంది. అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతంలో నిశ్బబ్దం ఆవరింఇంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. అక్కడున్న కనాడియా ప్రాంతంలోని ఆర్యసమాజ్‌లో 21 ఏళ్ల యువకుడుకి , 20 ఏళ్ల యువతికి పెళ్లి తంతు జరుగుతోంది. అప్పుడే వధూవరుల మధ్య వాగ్వాదం మొదలయ్యింది. అది పెద్ద గొడవకు దారి తీసింది. కోపంతో పెళ్లికుమారుడు విషయం తాగాడు. తాను విషం తాగానని పెళ్లి కూతురుకు చెప్పాడు. భయంతో కూడిన కంగారుతో ఆమె కూడా విషం తాగింది. ఈ ఇద్దరి పరిస్థితిని గమనించిన బంధువులు వెంటనే వారిని స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆసుపత్రికి చేరేలోపుగానే వరుడు చనిపోయాడు.
చక్కగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండకుండా పెళ్లిలో వధూవరులిద్దరూ విషం తాగారు. పెళ్లి కొడుకు చనిపోయాడు. పెళ్లికూతురి పరిస్థితేమో విషమంగా ఉంది. అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతంలో నిశ్బబ్దం ఆవరింఇంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. అక్కడున్న కనాడియా ప్రాంతంలోని ఆర్యసమాజ్‌లో 21 ఏళ్ల యువకుడుకి , 20 ఏళ్ల యువతికి పెళ్లి తంతు జరుగుతోంది. అప్పుడే వధూవరుల మధ్య వాగ్వాదం మొదలయ్యింది. అది పెద్ద గొడవకు దారి తీసింది. కోపంతో పెళ్లికుమారుడు విషయం తాగాడు. తాను విషం తాగానని పెళ్లి కూతురుకు చెప్పాడు. భయంతో కూడిన కంగారుతో ఆమె కూడా విషం తాగింది. ఈ ఇద్దరి పరిస్థితిని గమనించిన బంధువులు వెంటనే వారిని స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆసుపత్రికి చేరేలోపుగానే వరుడు చనిపోయాడు. వధువు పరిస్థితి సీరియస్‌గా ఉందని డాక్టర్లు చెప్పారు. గత కొన్ని రోజులుగా తనను పెళ్లి చేసుకోవాలంటూ పెళ్లికొడుకును పెళ్లి కూతురు ఒత్తిడి చేస్తున్నదని బంధువులు తెలిపారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నానని, రెండేళ్లు ఆగమని అతడు ఎంత చెప్పినా వినిపించుకోలేదట. పైగా పోలీసులకు కంప్లయింట్ చేసిందట! పెద్దలు కల్పించుకుని వారిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నారు. మరికాసేపట్లో పెళ్లి అనగా ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.