ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ చిన్నారి షాపింగ్ మాల్ మూడో అంతస్తు నుంచి పడి మృతి చెందింది. మంగళవారం జరిగిన ఈ ఘటన మాల్ ఆవరణలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ చిన్నారి షాపింగ్ మాల్ మూడో అంతస్తు నుంచి పడి మృతి చెందింది. మంగళవారం జరిగిన ఈ ఘటన మాల్ ఆవరణలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఓ వ్యక్తి చిన్నారిని తన చేతుల్లోకి ఎత్తుకుని వెళ్లడం కనిపించింది. మరో చిన్నారి ఎస్కలేటర్‌పైకి వెళ్లేందుకు ప్రయత్నించగా చిన్నారి చేతుల్లోంచి జారిపోయింది.

ఓ వ్యక్తి తన చేతుల్లో ఒక చిన్నారిని పట్టుకుని ఎస్కలేటర్ ఎక్కబోతూ కనిపించాడు. ఇంతలో మరో చిన్నారి నడుచుకుంటూ వస్తుండగా.. ఈ చేతుల్లోని చిన్నారి జారిపోయింది. ఒకటేసారి పై నుండి కిందకు పడిపోయింది. మూడో ఫ్లోర్ పై నుండి కిందకు పడిపోవడంతో చిన్నారి ప్రాణాలను వదిలింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. చిన్నారి సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. ఘటన జరిగిన వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని, ఓ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Updated On 20 March 2024 9:09 AM GMT
Yagnik

Yagnik

Next Story