100కి పైగా వాంగ్మూలాలు నమోదు చేశారు

కోల్‌కతాలోని ఆర్.జీ.కర్ ఆసుపత్రిలో వైద్యురాలి అత్యాచారం, హత్య కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెపై సామూహిక అత్యాచారం జరగలేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణలో తేలింది. అందుబాటులో ఉన్న సాక్ష్యాల ప్రకారం సంజయ్ రాయ్ మాత్రమే ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలుస్తోంది. విచారణ "చివరి దశ"లో ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఆసుపత్రి మాజీ చీఫ్ డాక్టర్ సందీప్ ఘోష్‌తో సహా 100కి పైగా వాంగ్మూలాలు నమోదు చేశారు. 10 పాలిగ్రాఫ్ పరీక్షలను నిర్వహించింది సీబీఐ, డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేయడంలో ఇతరుల ప్రమేయం ఉందని చెప్పడానికి ఎలాంటి కారణం లేదని వర్గాలు తెలిపాయి. RG కర్ హాస్పిటల్ రేప్-హత్య కేసు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. డాక్టర్ మరణానికి సంబంధించిన కారణాలు, ఆమె సామూహిక అత్యాచారానికి గురైందని ఆరోపిస్తూ అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిలో చాలా వరకూ వాస్తవం లేదు. హత్యను కప్పిపుచ్చడానికి పోలీసులు తమకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపణలు కూడా చేశారు. అయితే దీనిని పోలీసులు గట్టిగా ఖండించారు.


Sreedhar Rao

Sreedhar Rao

Next Story