సంతోషం ఎప్పుడు దుఃఖంగా మారుతుందో ఊహించలేం. ఆదివారం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం షిమ్లా జిల్లా కేంద్రం జెజో ప్రాంతంలో మూడు కుటుంబాలకు చెందిన 12 మంది సభ్యులతో సంతోషంగా వివాహానికి వెళ్తున్న ఇన్నోవా వాహనం వాగులో పడింది

సంతోషం ఎప్పుడు దుఃఖంగా మారుతుందో ఊహించలేం. ఆదివారం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం జెజో ప్రాంతంలో మూడు కుటుంబాలకు చెందిన 12 మంది సభ్యులతో సంతోషంగా వివాహానికి వెళ్తున్న ఇన్నోవా వాహనం వాగులో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 11 మంది చనిపోయారు. ఒక యువకుడు ఈ ప్ర‌మాదంలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. బంధువు వివాహ వేడుకకు హాజరయ్యేందుకు మూడు కుటుంబాలు జేజేస్ సమీపంలోని మెహ్రోవల్ గ్రామానికి వెళ్తున్నారు. కానీ దారిలో మృత్యువు తమ కోసం ఎదురుచూస్తోందని వారికి తెలియదు. ఈ ప్రమాదంలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన‌ యువకుడు దీపక్ సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

హిమాచల్-పంజాబ్ సరిహద్దు దిగువ భాగంలో ప్రవహించే లోయ ఉధృతంగా కనిపించింది. మొదట అందరూ అక్కడే ఆగి వేచి ఉండాలని భావించారు.. అయితే కొన్ని వాహనాలు నీటిని దాటడంతో వారు కూడా అక్కడ నుండి ముందుకు వెళ్లాలని భావించారు. కానీ అధిక వేగంతో నీరు చుట్టుముట్టడంతో వాహనం నీటిలో కొంత దూరం వెళ్లింది. వ‌ర‌ద ప్ర‌వాహానికి కొద్దిసేపటికే వాహనం దాదాపు 300 మీటర్ల దూరం వరకూ వెళ్లింది. స్థానికులు జేసీబీని పిలిపించి సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో కారులో ప్రయాణిస్తున్న దీపక్‌ను మాత్ర‌మే ప్రాణాల‌తో బయటకు తీశారు. ఇతరులను రక్షించలేకపోయారు. తొమ్మిది మంది మృతదేహాలను కనుగొన్నారు. మ‌రో ఇద్ద‌రు వ‌ర‌ద‌లో గ‌ల్లంత‌వ‌గా.. వారి కోసం అన్వేషణ కొనసాగుతుంది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story