రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్(Sukhdev Singh) గోగామేడిని గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ దారుణ హత్య తర్వాత రాజస్థాన్(Rajastan) నివురుగప్పిన నిప్పులా మారింది. హత్యకు నిరసనగా సుఖ్‌దేవ్ సింగ్ మద్దతుదారులు రాజస్థాన్ బంద్‌కు పిలుపు ఇచ్చారు. హత్య విషయం తెలియనగానే రాజ్‌పుత్ సామాజికవర్గం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తోంది.
రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్(Sukhdev Singh) గోగామేడిని గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ దారుణ హత్య తర్వాత రాజస్థాన్(Rajastan) నివురుగప్పిన నిప్పులా మారింది. హత్యకు నిరసనగా సుఖ్‌దేవ్ సింగ్ మద్దతుదారులు రాజస్థాన్ బంద్‌కు పిలుపు ఇచ్చారు. హత్య విషయం తెలియనగానే రాజ్‌పుత్ సామాజికవర్గం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తోంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు రాజ్‌పుత్ నేతలు. చురు, ఉదయ్‌పూర్, అల్వార్, జోధ్‌పూర్ జిల్లాలు అట్టుడుకుతున్నాయి. చాలా చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. జైపూర్‌లోని శ్యామ్‌నగర్‌లో ఆయన నివాసంలోనే గోగామేడి హత్యకు గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు సుఖ్‌దేవ్ నివాసానికి వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. గోగామేడితో మాట్లాడాల్సి ఉందని సెక్యూరిటీకి చెప్పి లోపలికి వెళ్లారు. కాసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని డీజీపీ ఉమేశ్ మిశ్రా కోరారు. నిందితుల రహస్యస్థావరాలపై దాడులు జరుగుతున్నాయన, త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు. ఇదిలా ఉంటే దుండగుల్లో ఒకడైన నవీన్ షెకావత్‌ను సుఖ్‌దేవ్ సింగ్ సహచరులు కాల్చి చంపారు. గోగామేడీ భద్రతా సిబ్బంది కాల్పుల్లో నవీన్ చనిపోయినట్టు జైపుర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ వెల్లడించారు.